ఓ వైపు నిత్యావసర ధరలు.. మరోవైపు చికెన్ ధరలు రోజురోజుకూ కొండెక్కుతుంటే... ఓ వ్యాపారి మాత్రం కేవలం రూ.70కే కిలో చికెన్ అమ్ముతూ సంచలనం సృష్టిస్తున్నాడు. మార్కెట్లో కిలో చికెన్ దాదాపు రూ.150కు అమ్ముతున్నా.. రంగారెడ్డి జిల్లా సూరారం కాలనీలోమాత్రం మహమ్మద్ తన దుకాణంలో స్పెషల్ కౌంటర్లు పెట్టాడు. స్కిన్ తో ఉన్న చికెన్ ను రూ.70కు, స్కిన్ లెస్ అయితే రూ.100కు అమ్మేస్తున్నాడు. ఈ విషయం తెలిసి.. జనం అంతా మహమూద్ షాపుకు ఎగబడ్డారు.
ఇలా సగం ధరకే చికెన్ అమ్మడానికి కారణం ఏమిటంటే.. చికెన్ వ్యాపారుల్లో మార్పు తేవడం కోసమేనట. సూరారం కాలనీలో చికెన్ వ్యాపారులంతా ఎవరికి ఇష్టం వచ్చిన ధరకు వాళ్లు అమ్ముతున్నారట. ఒకే ధరకు అమ్ముదామంటూ ఎన్ని సార్లు చెప్పినా ఎవరూ వినిపించుకోకపోవడంతో.. ఒళ్లు మండిన మహమూద్ ఇలా బంపర్ ఆఫర్ జనానికి ఇచ్చేశాడు. వ్యాపారులంతా కలిసికట్టుగా ఒకే రేటుకు అమ్ముతామని ఒప్పుకునే వరకూ.. కిలో చికెన్ 70 రూపాయలకే అమ్ముతానంటున్నాడు. మొత్తానికి వ్యాపారుల మధ్యపోటీ.. చికెన్ ప్రియులకు మాత్రం కడుపు నింపుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి