తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కేసీఆర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర నర్సింహన్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానంటూ ఎన్నికలకు ముందు చాలాసార్లు చెప్పిన కేసీఆర్, తర్వాత మాత్రం మనసు మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆ విషయం ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఫలితాలతో టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ దక్కడంతో, ఆ పార్టీలోని దళిత నాయకుల చేతే, లేజిస్లెటివ్ పార్టీ లీడర్ గా కేసీఆర్ పేరును ప్రతిపాదింప జేశారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా ముఖ్యమంత్రి అయ్యారు కేసీఆర్. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేసీఆర్ లాంటి బలమైన నేతే ముఖ్యమంత్రిగా ఉంటే.. తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందుతుందని, అందుకే ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామంటున్నాయి గులాబీ వర్గాలు. ఏదేమైనా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నారు కేసీఆర్.
governor లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
governor లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
2, జూన్ 2014, సోమవారం
23, అక్టోబర్ 2013, బుధవారం
హస్తినలో నర్సింహ రాయభారం
Categories :
bifurcation . congress . governor . narasimhan . POLITICS . TOP
రాష్ట్ర విభజనపై హస్తినలో కీలక చర్చలు జరుపుతున్నారు గవర్నర్ నర్సింహన్. మంగళవారమే ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారమంతా బిజీబిజీగా గడిపారు. ఉదయాన్నే ఆర్థికమంత్రి చిదంబరంతో అరగంటపాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం సోనియాగాంధీతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య కూడా అరగంట పాటు చర్చలు జరిగాయి. హైదరాబాద్ అంశంపైనా, సీమాంధ్రలో ఉద్యమ తీరుపైనా గవర్నర్ సోనియాకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ నర్సింహన్ ఇదే తరహా నివేదికలను ఇచ్చారు.సోనియాతో భేటీ అనంతరం హోంమంత్రి షిండేను కూడా కలుసుకున్నారు గవర్నర్. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాంతిభద్రతలు, తదితర అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కేంద్ర మంత్రి ఆంటోని, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని కూడా నర్సింహిన్ కలిసే అవకాశమున్నట్లు సమాచారం. గవర్నర్ ఇచ్చే నివేదికల ఆధారంగానే కేంద్రం విభజనపై ముందడుగు వేస్తుందన్న సమాచారం ఉండడంతో, ఆయన ఎలాంటి వివరాలు చెప్పారన్నదే ఉత్కంఠను కలిగిస్తోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
