తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖరారయ్యింది. దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడనున్న తెలంగాణ రాష్ట్రం జూన్ 2 నుంచి ఉనికిలోకి రానుంది. ఫిబ్రవరి 20 న పార్లమెంట్ ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ, జూన్ 2 నుంచే ప్రత్యేక రాష్ట్రంగా విధులను నిర్వహించనుంది. అయితే పార్లమెంట్ నిర్ణయం ప్రకారం పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై కేంద్రం ప్రకటన చేయడంతో, రెండు రాష్ట్రాలకు వేరువేరు షెడ్యూల్స్ లో ఎన్నికలు జరగనున్నాయి.
bifurcation లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bifurcation లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
5, మార్చి 2014, బుధవారం
జూన్ 2న ఆవిర్భవించనున్న తెలంగాణ
Categories :
bifurcation . POLITICS . seemandhra . telangana . telangana formation day
Read more...
19, ఫిబ్రవరి 2014, బుధవారం
సీఎం కిరణ్ రాజీనామా
Categories :
bifurcation . cm kiran . kiran kumar reddy . POLITICS . resign . seemandhra . TOP
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభ ఆమోదించడానికి నిరసనగా, ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. తెలుగు ప్రజలను వంచించిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆయన ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యం కాదని, తెలుగు ప్రజల భవిష్యత్తే అని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా రెండు ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. మరికాసేపట్లో ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పించనున్నారు. నవంబర్ 25, 2010న ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కిరణ్, మూడేళ్ల రెండు నెలల 19 రోజుల పాటు పదవిలో కొనసాగారు.
7, ఫిబ్రవరి 2014, శుక్రవారం
సీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ
Categories :
bifurcation . cabinet . POLITICS . seemandhra . tbill . telangana
సీమాంధ్ర కేంద్ర మంత్రుల ఒత్తిడితో రాష్ట్ర విభజన బిల్లుకు పలు సవరణలు సూచిస్తూ జీవోఎం ఇచ్చిన నివేదికను పాక్షికంగా ఆమోదించింది కేంద్ర కేబినెట్. రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపింది. దీన్ని రాష్ట్రపతికి పంపి ఆయన్నుంచి వచ్చిన తర్వాత పార్లమెంట్ లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. వీలైతే వచ్చేవారం మొదటి మూడు రోజుల్లో విభజన బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపైనే చర్చించడానికి ప్రత్యేకంగా సమావేశమైన కేంద్ర కేబినెట్ దీనిపై విస్తృతంగా చర్చించింది. సీమాంధ్ర సమస్యలపైనే కేంద్రమంత్రి కావూరి అరగంటకుపైగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే, హైదరాబాద్ ను యూటీ చేయాలన్న ప్రతిపాదనను తోసి పుచ్చిన కేంద్ర కేబినెట్, గతంలో ఆమోదించిన పదేళ్లపాటు ఉమ్మడి రాజధానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. అయితే, పోలవరం ముంపు గ్రామాలను పూర్తిగా సీమాంధ్రలోనే కలపాలని, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. బిల్లు ఆమోదం పొందిన తర్వాత సీమాంధ్ర కొత్త రాజధానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించనుంది కేంద్రం.
30, జనవరి 2014, గురువారం
అసెంబ్లీలో గెలిచిందెవరు..?
Categories :
assembly . bifurcation . parliament . POLITICS . seemandhra . t bill . telangana
రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కీలక ఘట్టం ముగిసిపోయింది. విజయం మాదంటే మాదంటున్నారు ఇరుప్రాంత నేతలు.. చర్చ ముగిసినందుకు తెలంగాణ వాదులది విజయం అనుకోవాలా.. లేక బిల్లును తిరస్కరించాలంటూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గినందుకు సమైక్యవాదులు గెలిచారనుకోవాలా.. ఇదే ఇప్పుడు అందరినీ డైలమాలో పడేస్తోంది..
చివరిరోజు ఏమవుతుందో అన్న టెన్షన్ లో అంతా ఉండగానే, ప్రక్రియను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. విభజన బిల్లుకు ఓ లక్ష్యం, ఓ ఆశయం లేదంటూ, అసలది బిల్లే కాదంటూ.. దాన్ని తిరస్కరించి పంపాల్సిందేనంటూ సీఎం కిరణ్ నోటీస్ ఇచ్చినప్పటి నుంచి సభ సజావుగా సాగడం లేదు. కేవలం వాయిదాలకే పరిమితం అవుతోంది. బీఏసీల మీటింగులు ఎన్ని నిర్వహించినా, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. సీఎం నోటీస్ తిరస్కరించాల్సిందేనంటూ తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించాల్సిందేనంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు శాసనసభలో ఆందోళనలకు దిగడంతో చర్చలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఇక చివరి రోజు కూడా ఇవే సంఘటనలు సభలో పునరావృతమయ్యాయి. రెండుసార్లు సభ వాయిదా వేసి, మూడోసారి సమావేశ పరిచిన స్పీకర్.. అకస్మాత్తుగా చర్చా వివరాలను ప్రకటించి, ఇంతవరకూ రికార్డైన 86 మంది ప్రసంగాలలో పాటు ఎమ్మెల్యేలు ఇచ్చిన లిఖితపూర్వక సమాచారాన్ని, బిల్లుకు సూచించిన 9072 సవరణలను కలిపి రాష్ట్రపతికి పంపిస్తానని సభలో ప్రకటించారు. ఆ తర్వాత సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ముందు ఓటింగ్ కు ఉంచారు. మూజువాణి ఓటింగ్ ను నిర్వహించి.. తీర్మానం నెగ్గిందని చెప్పి సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇక్కడే అసలు గొడవ మొదలయ్యింది.
రాష్ట్రపతి ఇచ్చిన గడువు ప్రకారం చర్చను ముగించేశారు స్పీకర్ నాదెండ్ల మనోహర్. సభ్యుల అభిప్రాయాలను రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతోపాటే, సభ బిల్లును తిరస్కరించాలని తీర్మానించిందంటూ రాష్ట్రపతికి పంపించనున్నారు. దీంతో బిల్లుపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది. అయితే, కేవలం అభిప్రాయాల కోసమే బిల్లును శాసనసభకు పంపించారు కాబట్టి, వాటినే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారన్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది. అయితే, బిల్లును తిరస్కరిస్తూ సభ తీర్మానం చేసింది కాబట్టి, పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టకూడదని సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. మూజువాణి ఓటంటే ఏకగ్రీవ నిర్ణయంతో సమానం కాబట్టి, సభంతా సమైక్యవాదానికే కట్టుబడి ఉందని గుర్తించాలన్నారు మంత్రి ఆనం.
సీఎం తీర్మానాన్ని సభలో నెగ్గించడం దుర్మార్గమంటూనే, చర్చ ముగిసినందుకు మాత్రం హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ నేతలు. తమకు కావాల్సింది అసెంబ్లీలో ప్రక్రియ ముగియడమేనంటున్నారు. ఢిల్లీ దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్లూ దీనికి తగ్గట్లే ఉన్నాయి. సీఎం తీర్మానంపై మాత్రమే సభ ఓటింగ్ నిర్వహించిందని, బిల్లుపై కాదంటూ ఆయన ప్రకటించారు. పైగా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానికి సంక్రమించిన అధికారాలకు ఈ తీర్మానం ఏమాత్రం విఘాతం కలిగించదన్నారాయన. ఫిబ్రవరి 4న జీవోఎం సమావేశంలో అసెంబ్లీ పంపించిన అభిప్రాయాలపై చర్చించే అవకాశం ఉంది. సభ సూచించిన సవరణల్లో సహేతుకమైన వాటిని బిల్లులో పొందుపరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించాలని భావిస్తున్న యూపీఏ సర్కార్కు బీజేపీ మద్దతు తప్పని సరి. అందుకే, బీజేపీ సూచిస్తున్న పోలవరానికి జాతీయ హోదా, పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడం, సీమాంధ్ర రాజధానికి నిర్ధిష్టమైన నిధుల కేటాయింపును ప్రకటించే అవకాశం ఉంది.
అసెంబ్లీ సమైక్య తీర్మానం చేయగలిగిన సీమాంధ్ర నేతలు, ఇప్పుడు దృష్టంతా ఢిల్లీపై పెట్టారు. పార్లమెంట్లోనూ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు.

3, డిసెంబర్ 2013, మంగళవారం
యూటీ మూగబోయే.. ప్రత్యేక రాష్ట్ర పాట మొదలయ్యే
Categories :
bifurcation . hyderabad . jd sheelam . kavuri . pallam raju . POLITICS . seemandhra . shinde . special state . telangana . TOP
రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని, లేకపోతే విభజనకు అంగీకరించమని నానా హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, హైకమాండ్ పట్టించుకోకపోయేసరికి కొత్తపాట మొదలుపెట్టారు. ఇవాళ సాయంత్రం జీవోఎం చివరి సమావేశం జరుగుతుండడంతో సరికొత్త ప్రతిపాదనను లేవనెత్తారు. పరిమితకాలం పాటు హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కావూరి చాంబర్ లో సమావేశమై చర్చలు జరిపిన జేడీశీలం, పళ్లంరాజు, జీవోఎం భేటీకి ముందే షిండేను కలిసి ఈ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అటు 69 పేజీల నివేదికను సిద్ధం చేసిన జీవోఎం ఇవాళ భేటీ అనంతరం, దాన్ని ప్రధానికి, కేబినెట్ కు పంపించనుంది. రాయలతెలంగాణ ఏర్పాటు దిశగానే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)