జగన్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దాదాపు 16 నెలల తర్వాత బెయిల్ మంజూరయ్యింది. అక్రమాస్తుల కేసులో 2012 మే 27న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ పది ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో అరెస్టయిన జగన్ 16 నెలలుగా నగరంలోని చంచల్‌గూడ కారాగారంలో ఉన్నారు. రూ.2 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయస్థానం షరతు విధించింది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేయమని కోరుతూ న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. జగన్మోహన్‌రెడ్డి హైదరాబాద్ విడిచివెళ్లకూడదని కూడా న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. కేసుతో సంబంధమున్న ఎవర్ని ప్రలోభపెట్టే యత్నం చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కు బెయిల్ రావడంతో వైఎస్సార్ సీపీ లో కొత్త ఉత్సాహం వచ్చింది. సీమాంధ్రలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావంతో ఉన్నారు వైసీపీ నేతలు.
Read more...
bail లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bail లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, సెప్టెంబర్ 2013, సోమవారం
24, జనవరి 2013, గురువారం
జగన్ కు ఇక జైలే గతి
భారత దేశాన్ని కొల్లగొట్టడానికి మహ్మద్ ఘోరీ 17 సార్లు దండయాత్రలు చేసినట్లుగా.. బెయిల్ దక్కించుకోవడానికి వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలు ఏమాత్రం ఫలించడం లేదు. తాజాగా
హైకోర్టులోనూ జగన్ కు చుక్కెదురయ్యింది. జగన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. బెయిల్ కు అనర్హమైందిగా భావిస్తూ పిటిషన్ ను కొట్టేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం, బెయిల్ పటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది హైకోర్ట్. అటు సీబీఐ దర్యాప్తుకు కాలపరిమితి విధించాలన్న జగన్ తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని కూడా కోర్టు తిరస్కరించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుకే చెప్పుకుని ఉండాల్సిందని ధర్మాసనం పేర్కొంది. దీంతో, సీబీఐ దర్యాప్తు సాగే అవకాశం ఉంది. అప్పటివరకూ జగన్ జైల్లోనే మగ్గిపోవాల్సి ఉండొచ్చు. హైకోర్టు నిర్ణయంతో జగన్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు నిరాశలో కూరుకుపోయారు.
Read more...
5, అక్టోబర్ 2012, శుక్రవారం
మరో ఆర్నెల్లు జైల్లోనే జగన్
సుప్రీంకోర్టులో వైఎస్ జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ వస్తుందనుకుంటే.. అసలుకే ఎసరొచ్చింది. సీబీఐ క్షక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న జగన్ వాదన కోర్టులో నిలవలేదు. అదే సమయంలో సీబీఐ గట్టిగా వాదించడంతో.. వారివైపే ధర్మాసనం మొగ్గుచూపింది. మారిషస్ నుంచి లగ్జెంబర్గ్ మీదుగా అక్రమంగా నిధులు వచ్చాయన్న సీబీఐ.. వాటికి సంబంధించిన కచ్చితమైన ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపింది. దీనిపై నోట్ ఫైల్ ను సమర్పించింది. నాలుగు ఛార్జిషీట్లలో 3వేల కోట్లకు పైగా అక్రమంగా జగన్ సంపాదించినట్లు గుర్తించామని సీబీఐ చెప్పింది. జగన్ కేసులో విచారణ పూర్తి కాలేదని, ఇంకా కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే.. సాక్షులను బెదిరించి, విచారణకు అడ్డుపడవచ్చని వాదించింది. దీంతో ఏకీభవించిన కోర్టు.. పదేళ్లలో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారంటూ జగన్ తరపు లాయర్లను ప్రశ్నించింది. జగన్ కు బెయిల్ ఇవ్వలేమని తేల్చేసింది. మరోసారి బెయిల్ పిటిషన్ కు అనుమతించాలన్న లాయర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చింది. మార్చి 31లోగా జగన్ కేసులో విచారణ పూర్తి చేయాలని సీబీఐను ఆదేశించిన కోర్టు.. మార్చి 31 తర్వాతే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని జగన్ కు సూచించింది. సుప్రీం నిర్ణయంతో ఆరునెలల పాటు జగన్ జైల్లో నే ఉండాల్సి వస్తోంది.
Read more...
30, జూన్ 2012, శనివారం
బెయిల్ బేహారి పట్టాభి
బెయిల్ ఫర్ సేల్.. అడిగినన్ని డబ్బులిస్తే.. ఎవరికైనా, ఎలాంటికేసులైనా బెయిల్ గ్యారెంటీ. అప్పుడెప్పుడో.. అక్కడెక్కడో న్యాయమూర్తి అవినీతి పరులని చదివిన మనకు.. ఇక్కడా ఉన్నానంటూ... నిరూపించాడు జస్టిస్ పట్టాభి. బెయిళ్లతో వ్యాపారం చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇనుప గనుల అక్రమార్కుడు గాలి జనార్దనరెడ్డికి, బెయిల్ ఇవ్వడంపై శోధించిన ఏసీబీ మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. అవినీతి కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ సర్వేశ్వరరెడ్డికి బెయిల్ ఇవ్వడానికీ..పట్టాభి లంచం తీసుకున్నాడట. పది లక్షల రూపాయలను వసూలు చేసి, అతనికి బెయిల్ మంజూరు చేశాడు. ఆ తర్వాత గాలి కేసులో భారీగానే డబ్బు డిమాండ్ చేశాడు. ఈ డీల్ కోసం పెద్దమొత్తంలోనే బేరసారాలు సాగాయి. పదికోట్ల రూపాయల నుంచి మొదలై.. చివరకు 5 కోట్లకు డీల్ సెటిల్ అయ్యింది. ఈ వ్యవహారంలో మరో కొత్తపేరూ బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్‌లో పనిచేస్తున్న ప్రభాకర్‌రావు.. ముందుగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు. దీన్ని తిరస్కరించిన పట్టాభి.. తిరిగి తన స్నేహితుడు రిటైర్డ్ జడ్జి చలపతిరావు ఈ ఆఫర్ తెచ్చేసరికి ఓకే అన్నారు. దీని కోసం నాచారంకు చెందిన యాదగిరిరావు, చలపతిరావులు కలిసి డీల్ ఫిక్స్ చేశారు. పట్టాభి కొడుకు రవిచంద్ర కూడా ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నాడు..
డీల్ ఓకే కావడంతో.. మే 11న గాలి జనార్దనరెడ్డికి జస్టిస్ పట్టాభి బెయిల్ మంజూరు చేశారు. ఈ తంతు జరుగుతున్న సమయంలో.. మొత్తం 12 సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పట్టాభిరామరావు కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జీ చలపతిరావుల నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విషయాలను ఏసీబీ పేర్కొంది. దీన్ని కోర్టుకు సమర్పించింది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



