9, జనవరి 2012, సోమవారం
రేపటి నుంచే జగన్ దీక్ష.. భారీ ఉత్కంఠ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రైతుదీక్ష రేపు మొదలుకానుంది. జగన్ దీక్ష కోసం ఇప్పటికే వైఎస్సార్ సీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఆర్మూరు శివారులో భారీ వేదికను నిర్మించారు. వేలాది మంది దీక్షలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. తమ దీక్షకు సహకరించాలని, జగన్ ను అడ్డుకోవద్దని తెలంగాణ వాదులకు వైఎస్సార్ సీపీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ విజ్ఞప్తి చేశారు. కానీ, ఆర్మూర్లో జగన్ను కాలు పెట్టనివ్వమని, అసలు తెలంగాణలోకే రానివ్వమని తెలంగాణవాదులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. జగన్ ను అడ్డుకోవడానికి పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. భారీగా సెక్యూరిటీ ఇచ్చి జగన్ ను పంపుతుందా, లేక మధ్యలోనే అరెస్ట్ చేసి హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంటికి పంపించేస్తుందా..? అదీ కాదంటే, బాబు టూర్ తరహాలో తెలంగాణ వాదులను ముందుగానే అరెస్ట్ చేసి లైన్ క్లియర్ చేస్తుందా అన్నది తేలాల్సి ఉంది. జగన్ మాత్రం ఈ దీక్ష విషయంలో ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదనుకుంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి