25, జనవరి 2012, బుధవారం
తెలుగువారికి ఈ సారీ అన్యాయమే..!
Categories :
bapu . news . padma awards . TOP
ఐదు పద్మవిభూషణ్‌లు, 27 పద్మ భూషణ్‌లు.. 77 పద్మశ్రీలు... వీటన్నింటిలోనూ మన రాష్ట్రానికి దక్కింది కేవలం రెండంటే రెండు పద్మశ్రీలు.. ఒకటి చిత్తూరు జిల్లాకు చెందిన మునిరత్నానికి, మరొకటి బ్యాడ్మింటన్ కోచ్ ఆరిఫ్‌కు దక్కాయి. ఢిల్లీ నుంచి తెలుగువ్యక్తి.. టి.వి.రాజేశ్వర్‌కు పద్మవిభూషణ్, ఎన్.ఆర్.ఐ కోటాలో జర్మనీలో ఉంటున్న తెలుగు వ్యక్తి పాటిబండ్ల చంద్రశేఖర్ రావుకు పద్మభూషణ్ పురస్కారం వరించాయి. రాష్ట్రం పంపించిన జాబితాలో సుప్రసిద్ధ దర్శకుడు, చిత్రకారుడు బాపు, భారత బ్యాడ్మింటన్ కే వన్నె తెచ్చిన గుత్తా జ్వాలల పేర్లున్నప్పటికీ, వారికి ప్రభుత్వం పట్టించుకోలేదు. బాపు పేరును కేంద్రం చాలాసార్లు తిరస్కరించింది. మీరానాయర్ కు, షబానా అజ్మీకి పద్మభూషణ్ లు ఇచ్చిన కేంద్రం, బాపూను తిరస్కరించడం దారుణమే..మనవాళ్లపై, తెలుగువాళ్లకు ఢిల్లీ పెద్దలు ఇస్తున్న గౌరవం ఏమిటో దీంతో మరోసారి స్పష్టమయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాపు పేరును పద్మ అవార్డుకు కేంద్రం తిరస్కరించటం దారుణాతిదారుణం.
తెలుగువాళ్ళంటే కేంద్రానికి యెప్పుడూ సవతితల్లి ప్రేమే.
అయ్యలారా, అమ్మలారా, ఈ పద్మ అవార్డులను తెలుగు వాళ్ళు నిద్వంద్వంగా తిరస్కరిస్తున్నాం అని ప్రకటించుతున్నాను. ఎవరికన్నా అభ్యంతరమా?
ఎవరికైనా ఈ తెలుగువారి తిరస్కరణను తెలియజేయటానికి సరైన పోష్టు/ఇ-మెయిల్ మరియు ఇతర పధ్ధతుల స్పష్టంగా తెలిస్తే చెప్పండి తెలుగువాళ్ళందరూ 'ఈ పద్మా అవార్డుల ప్రహసనాన్ని' ఇకనైనా ఘాటుగా తిప్పికొట్టాలి