25, జనవరి 2012, బుధవారం
సచిన్‌కు ఈ సారి భారతరత్న లేనట్లే..!
Categories :
bharataratna . dhyanchand . news . sachin . sports . TOP
సచిన్‌కు, సచిన్ అభిమానులకు నిరాశ కలిగించే వార్తఇది. భారతదేశ అత్యున్నత పురస్కారం, భారతరత్నను సచిన్ కు ఇవ్వాలంటూ చాలాకాలంగా డిమాండ్ దేశంలో ఊపందుకొంది. దీనికి తగ్గట్లే, క్రీడాకారులకు సైతం అవార్డు ఇవ్వొచ్చంటూ ఇటీవలే భారతరత్న నిబంధనల్లో మార్పులు కూడా చేశారు. ఇంకేముంది, ఈ సారి సచిన్ కు అవార్డు ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, ఆ ఆశలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అడియాశలు చేసింది. భారతరత్న అవార్డుకు ఈ సారి సచిన్ పేరును పంపలేదు. అయితే, దేశంలోని ప్రధాన క్రీడాకారులంతా కోరుకుంటున్నట్లు.. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ పేరును మాత్రం అవార్డుకు సిఫార్సు చేసింది. చెప్పాలంటే, ధ్యాన్ చంద్ కు ఈ సారి భారతరత్న అవార్డు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన తొలి క్రీడాకారుడు ధ్యాన్ చందే. అలాంటి మహోన్నత వ్యక్తికి ఇవ్వకుండా సచిన్ కు ఇవ్వమని కోరితే, విమర్శలు వస్తాయని భావించిన నేపథ్యంలోనే, ముందుగా ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే, భవిష్యత్తులో సచిన్ కు భారతరత్న పురస్కారం అందడం ఖాయంగానే కనిపిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి