3, జనవరి 2012, మంగళవారం
టాటా నానోకు బజాజ్ సవాల్
ప్రపంచంలో అత్యంత చవక కారైన టాటా నానోకు.. బజాజ్ సవాల్ విసిరింది. తన సరికొత్త, మొట్టమొదటి కారు ఆర్.ఇ. 60ని జనం ముందుకు తెచ్చింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆటో షోలో దీన్ని ప్రదర్శిస్తున్నారు. గ్రీన్ కార్ గా దీన్ని టాటా ప్రచారం చేస్తోంది. కిలోమీటర్ కు 60 గ్రాముల కార్బన్ డై ఆక్సైడ్ ను మాత్రమే ఈ కారు విడుదల చేస్తుందని బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్ ప్రకటించారు. ఇక లీటరు పెట్రోల్ కు 35 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందనీ ఆయన చెప్పారు. నలుగురు కూర్చోవడానికి వీలుగా తయారు చేసిన ఈ కారులో గరిష్ట వేగం మాత్రం 70 కిలోమీటర్లే సాధ్యం. నగరాల్లో వాడకానికి అనువుగా తీర్చి దిద్దిన ఆర్.ఇ.60 .. టాటా నానోకు గట్టి పోటీ ఇస్తుందని ఆటో ఇండస్ట్రీలో చర్చసాగుతోంది. డిజైన్ విషయంలో నానోతో పోలిక లేకపోయినా, ఆకట్టుకునే రీతిలోనే బజాజ్ డిజైన్ చేసింది. త్వరలోనే దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెస్తామని కంపెనీ ప్రకటించింది. నిస్సాన్, రెనాల్ట్ ల భాగస్వామ్యంలో దీన్ని ఉత్పత్తి చేయాలని బజాజ్ భావిస్తోంది. దీని ధర ఎంతన్నది అధికారికంగా ప్రకటించకపోయినా.. లక్షా 25 వేల నుంచి రెండు లక్షల మధ్య ఉండవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
డబ్బా కారులా ఉంది.