4, జనవరి 2012, బుధవారం
ఈటీవీ నెట్‌వర్క్ అమ్మేసిన రామోజీ..
ఈటీవీ నెట్‌వర్క్ అమ్మకంపై చాలాకాలంగా కొనసాగుతున్న ఉత్కఠ వీడిపోయింది. సీఎన్‌బీసీ, సీఎన్‌ఎన్ ఐబీఎన్, కలర్స్ లాంటి ఛానల్స్ నిర్వహిస్తున్న టీవీ 18 గ్రూప్.. ఈటీవీ నెట్‌వర్క్‌లో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంది. హిందీ ఛానళ్లైన ఈటీవీ ఉత్తర ప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్‌తో పాటు ఈటీవీ ఉర్ధూను పూర్తిగా సొంతం చేసుకుంది. ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ గుజరాతీ, ఈటీవీ ఒరియాల్లో యాభైశాతం వాటాను సొంతం చేసుకుంది. ఈటీవీ తెలుగు, ఈటీవీ రెండులో 24.5 శాతం వాటాను దక్కించుకుంది. ఈ డీల్ విలువ 2100 కోట్ల రూపాయలని టీవీ 18 గ్రూప్ ప్రకటించింది. టీవీ 18, ఈటీవీల మధ్య డీల్ కుదర్చడంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈటీవీకి చెల్లించాల్సిన 2100 కోట్ల రూపాయలను టీవీ 18 గ్రూప్‌కు రిలయన్స్ ట్రస్ట్ ద్వారా ఆయన అందిస్తున్నారు. ప్రతిగా, టీవీ 18, ఈటీవీ గ్రూప్ ఛానళ్ల వైరెలెస్ ప్రసారాలను చేసుకునే హక్కును ఆయన నేతృత్వంలోని ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్‌కు దక్కుతాయి. దేశవ్యాప్తంగా 4జీ లైసెన్సులు ఇన్ఫోటెల్‌కు ఉన్నాయి. త్వరలోనే బ్రాడ్‌బ్యాండ్ రంగంలో విప్లవం సృష్టించడానికి సిద్ధమవుతున్న ముఖేశ్ అంబానీ, వైర్‌లెస్ పద్దతిల్లో, బ్రాడ్‌బ్యాండ్ ద్వారా టీవీ ఛానళ్లను కూడా అందించడానికి తాజా డీల్ ఉపయోగపడుతుంది. ఛానళ్లలో వాటాలు అమ్మడం ద్వారా రామోజీ ఆర్థిక కష్టాలు చాలా వరకూ తీరిపోనున్నాయి.
టీవీ 9ను కూడా దాని ప్రమోటర్లు అమ్మేయడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే టైమ్స్ నౌ గానీ, మరో సంస్థ గానీ టీవీ 9ను టేకోవర్ చేసే అవకాశాలున్నాయి.
కొసమెరుపు.. ఈటీవీ 2, టీవీ 9 కన్నా ఓ నెల రోజులు ముందుగా ప్రసారాలు ప్రారంభించింది. ముందుగానే అమ్ముడయ్యింది. టీవీ 9 అమ్మకానికి సిద్ధం గాఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి