19, డిసెంబర్ 2011, సోమవారం
వైకల్యం పీడించింది..గిన్నీస్ బుక్ తలవంచింది
Categories :
guinnes record . jyothy . life . news . TOP
నాగపూర్‌కు చెందిన జ్యోతి ఆమ్గే స్టైలే వేరు. ఎందుంకంటే ఆమె అందరికన్నా ప్రత్యేకం. ఆ ప్రత్యేకతే ఆమె ముందు గిన్నీస్ రికార్డ్ తలవంచేలా చేసింది. జ్యోతి ఆమ్గేకు డిసెంబర్ 16తో పద్దెనిమిదేళ్లు నిండాయి. ఈ పుట్టినరోజే, ఆమెకు గిన్నీస్ రికార్డును కానుకగా ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతి చిన్న మహిళ.. జ్యోతి ఆమ్గే. కేవలం 59 సెంటీమీటర్ల ఎత్తుతో ఈ రికార్డును జ్యోతి సాధించగలిగింది. ఇంతవరకూ అమెరికాకు చెందిన బ్రిడ్గెట్టె జోర్డాన్ పేరిట ఈ రికార్డ్ ఉంది. ఆమె ఎత్తు 69 సెంటీమీటర్లు. ఇప్పుడు ఆ రికార్డు జ్యోతిది.
జ్యోతి ఫస్ట్ బర్త్‌డే జరిగిన తర్వాత ఆమె ఎదుగుదల ఆగిపోయింది. అకోండ్రోప్లాసియా అనే వ్యాధి ఆమెకు సోకిందని, ఇక పెరగడం కష్టమేనని వైద్యులు తేల్చేశారు. అయితే, అందరిలా శారీరంగా ఎదగలేకపోయినా, ఎంతో ధైర్యంతో ఈ వైకల్యాన్ని అధిగమించింది జ్యోతి. రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లింది. బాగా చదువుకొంది. జ్యోతికి అనువుగా ఉండడం కోసం, స్కూల్లో ప్రత్యేక బెంచ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రపంచంలోనే స్మాలెస్ట్ ఉమెన్‌గా రికార్డు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని జ్యోతి చెబుతోంది. ఇంతకాలం ఆమెను తలచుకుని బాధపడ్డ, తల్లిదండ్రులు కూడా ఇప్పుడెంతో కుషీగా ఉన్నారు. జ్యోతి త్వరలోనే రెండు బాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి