14, నవంబర్ 2011, సోమవారం
సీబీఐ ఉచ్చులో చంద్రబాబు
Categories :
cbi . chandrababu . POLITICS . tdp . TOP
చంద్రబాబు ఆస్తులపై సీబీఐ దర్యాప్తు త్వరలో మొదలుకానుంది. ఇటీవలే తన కుటుంబ సభ్యుల ఆస్తులంటూ, ఎప్పటి లెక్కలనో ప్రకటించిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి వాస్తవ విలువను చెప్పాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. వైఎస్సార్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, రాజశేఖరరెడ్డి సతీమణి విజయలక్ష్మి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్ట్.. చంద్రబాబు ఆస్తులపై ప్రాథమిక విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో ఏమైనా అవకతవకలకు పాల్పడినట్లు తేలితే, అప్పుడు పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రి శంకర్రావు వేసిన పిటిషన్ పై ఇదే రీతిలో స్పందించిన న్యాయస్థానం జగన్ పై ముందు ప్రాథమిక విచారణకు, ఆ తర్వాత పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించిన విషయం అందిరకీ తెలిసిందే. మరి చంద్రబాబు విషయంలోనూ అదే జరుగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. మూడు నెలల్లోగా ప్రాథమిక విచారణను పూర్తి చేసి వివరాలను సీల్డ్ కవర్ లో అందజేయాలని సీబీఐను కోర్టు ఆదేశించింది. ఎమ్మార్, గాలి కేసుల్లో తీరికలేకుండా ఉన్న సీబీఐ, ఇప్పుడు చంద్రబాబు కేసును కూడా మోయాల్సి ఉంది. ఓ రకంగా సీబీఐ ఉచ్చు చంద్రబాబు చుట్టూ బిగుసుకొంటోంది. మరి దాన్నుంచి బయటపడతారో లేక, చిక్కుకుపోతారో తేలాల్సిఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి