4, నవంబర్ 2011, శుక్రవారం
జనం ఎక్కువగా తింటున్నారట.. అందుకే ద్రవ్యోల్బణం పెరిగిందట..
అప్పుడెప్పుడో ప్రపంచంలో ఆహారం కొరతకు భారతీయులే కారణమని అమెరికా ప్రెసిడెంట్ అంటే మనకు ఒళ్లు మండిపోయింది. ఎవడెంత తింటున్నారంటూ లెక్కలేసుకుని మరీ అమెరికన్లను చెడమడా తిట్టేశాం. కానీ, ఇప్పుడు దాదాపుగా అంతే మాటను మన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అనేశారు. ద్రవ్యోల్భణం పెరగుతూనే ఉండడానికి ఆయన అందరూ అవాక్కయ్యే కారణాన్ని చెప్పారు. అదే పండగల సీజన్. ఈ సీజన్లో ఆహార పదార్థాలకు ఎక్కువ డిమాండ్ ఉండడం వల్లనే ద్రవ్యోల్బణం పెరిగిందంటూ చేతులు దులుపుకున్నారు.
కూరగాయలు, తృణ ధాన్యాలు, పాలు వంటి ధరలు పెరగడం వల్ల అక్టోబరు 22తో ముగిసిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 12.21 శాతానికి చేరింది. అంతక్రితం వారం ఇది 11.43 శాతంగా ఉంది. ఇది తొమ్మిది నెలల గరిష్ఠ స్థాయి. అంతక్రితం వారంతో పోలిస్తే 0.78 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 13.55 శాతంగా ఉంది. గురువారమిక్కడ ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ఏడాదిక్రితం ధరలతో పోలిస్తే కూరగాయలు 28.89%, పప్పు ధాన్యాలు 11.65%, పళ్లు 11.63%, పాలు 11.73% మేర ప్రియమయ్యాయి. పాలు, మాంసం, చేపలు 13.36% హెచ్చాయి. మరో పక్క ఉల్లి 20.33%, గోధుమలు 1.54% చౌక కావడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్ బీ ఐ వరసగా వడ్డీరేట్లు పెంచుతున్నా ఫలితం కనపడకపోవడంతో, దాన్ని పండగలమీదకు తోసేశారు ప్రణబ్. ఇంకా నయం, పండగక ముందే ఏవీ కొనుక్కోకూడదంటూ రేషన్ పెట్టలేదు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
జనం ఎక్కువగా తింటే మన దేశంలో ఇన్ని ఆకలి చావులు ఎందుకు ఉంటాయి? ఒరిస్సాలోని కలహండి జిల్లాలో రెండు కాలాలలో వరి పండుతుంది కానీ అక్కడి రై మిల్లర్లు బియ్యాన్ని వేరే ప్రాంతాలకి ఎగుమతి చెయ్యడం వల్ల అక్కడి స్థానికులు ఆకలి చావులకి బలవుతుంటారు.
ఇంత దిక్కుమాలిన పనికిమాలిన వ్యాఖ్య ప్రజల మీద చేసినందుకు ఆర్ధిక మంత్రిగా సిగ్గుపడాలి. ఏ ఏ సమయాలలో ఎంత ఆహార ఉత్పత్తులను ప్రజలకి అందుబాటులో వుంచాలో తెలియని ఈ పనికి మాలిన చవట ఆర్ధిక మంత్రి వెంటనే రాజీనామా చేస్తే దేశానికి, దేశ ప్రజలకీ గౌరవంగా వుంటుంది. వేరే దేశంలో అయితే ఈ పనికిమాలిన మంత్రిని ...........