3, నవంబర్ 2011, గురువారం
సీబీఐ ఖైదులో కోనేరు ప్రసాద్
Categories :
cbi . emmar . koneru prasad . news . TOP
ఎమ్మార్ అవకతవకల కేసులో కోనేరు ప్రసాద్‌ను సీబీఐ అధికారులు అరెస్టుచేశారు. విల్లాల అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సీబీఐ చర్యలకు ఉపక్రమించింది. రేపు ఉదయం కోనేరు ప్రసాద్‌ను కోర్టులో హాజరు పర్చనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 15న ఎమ్మార్ వ్యవహారంపై సీబీఐ కేసునమోదుచేసింది. రికార్డుల్లో గజం రూ.5వేలు ధర నమోదుచేసిన స్టైలిష్ హోమ్ గజం రూ.25వేల నుంచి రూ.50వేలకు విక్రయించినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మార్ కుంభకోణంలో కోనేరు ప్రసాద్, రంగారావులు కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ భావిస్తోంది. విల్లాలు కొన్న వారిలో కేపీవీ, డీఎస్,చంద్రబాబు తనయుడు లోకేశ్.. ఇలా ఎంతోమంది ప్రముఖులున్నారు. వీరందరి రిజిస్ట్రేషన్ పత్రాల్లో గజం 5వేల రూపాయలకే అమ్మినట్లుగా ఉంది. పైగా కోనేరు ప్రసాద్ కు రాష్ట్రంలోని ముఖ్యరాజకీయ నేతలందరితోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన్నే అరెస్ట్ చేశారంటే, ఎమ్మార్ కేసులో మరిన్ని అరెస్టులు ఖాయంగానే కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి