3, నవంబర్ 2011, గురువారం
మంత్రినే ఎదిరిస్తావా...? ఇదిగో బహుమతి
మంత్రిని ఎదిరించినందుకు, మంత్రి మాటవిననందుకు, అందరి ముందూ మంత్రి సంగతిని బయటపెట్టినందుకు, ఓ సబ్ కలెక్టర్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ మంత్రి.. మోపిదేవి వెంకటరమణ అయితే.. ఆ సబ్ కలెక్టర్ బాలాజీ దిగంబర్. తెనాలి సబ్‌కలెక్టర్ బాలాజీ దిగంబర్ మంజులేపై బదిలీవేటు వేసిన సర్కార్, తక్షణమే రిపోర్ట్‌చేయాలని గురువారం ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగింది..?
రేపల్లె నియోజకవర్గంలోని నగరం మండలంలో ఇద్దరు రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడ్డారని తెనాలి సబ్ కలెక్టర్ వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకున్నారు. వీటికి ఇంఛార్జి బాధ్యతల్ని డ్వాక్రా సంఘాలు, ఇతర డీలర్లకు అప్పజెప్పారు. అయితే.. మంత్రి మాత్రం తన అనుచరులైన ఆ డీలర్లకే మళ్లీ బాధ్యతలు అప్పగించాలని సబ్ కలెక్టర్ పై ఒత్తిడి తెచ్చారు. మాటవిననందుకు అతనిపై బదిలీకి రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ దిగంబర్, మీడియా సమావేశం పెట్టి మరీ అంతా చెప్పారు. తనకు అనుగుణంగా ఉండే వారిని తెనాలి రెవిన్యూ డివిజినల్ అధికారిగా ఉంచటం మేలని భావించి కుట్ర చేశారన్నారు. ఆయన ఊహించినట్లుగానే చివరకు బదిలీవేటు పడింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి