4, నవంబర్ 2011, శుక్రవారం
జగన్ ను విచారిస్తున్న సీబీఐ
సీబీఐ నోటీసులు అందుకున్న జగన్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఈ ఉదయం చేరుకున్నారు. ఆడంబరంగా ఇంటినుంచి బయలుదేరిన జగన్, సీబీఐ ఆఫీసులోకి మాత్రం వెనుకగేటునుంచి వెళ్లారు. గాలిజనార్దనరెడ్డి అక్రమమైనింగ్ కేసులో భాగంగా జగన్ ను సీబీఐ విచారిస్తోంది. గాలి అక్రమ వ్యవహారంలో జగన్ పాత్ర, రెడ్ గోల్డ్ లో పెట్టుబడులు, సాక్షిలో ఆర్.ఆర్.గ్లోబల్ పెట్టుబడులపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రతీ విషయాన్ని చాలా కూలంకుషంగా అడిగి తెలుసుకుంటున్నారు.
సాక్షిగా మాత్రమేనా..?
తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని గాలిజనార్దన్‌రెడ్డి కేసులో సాక్షిగా విచారించేందుకే సీబీఐ నోటీసు జారీ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. సీఆర్పీసీ 160(1) అనే సెక్షన్ కింద జగన్‌ను పిలిచారని, ఈ సెక్షన్ కింద సాక్షిగా విచారించేందుకు మాత్రమే నోటీసు ఇస్తారని వివరించారు. కానీ, జగన్‌ను అక్రమ ఆస్తుల విషయంలో విచారణకు పిలిచారని, ఆయన్ను త్వరలో అరెస్టు చేయనున్నారని చంద్రబాబు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
జగన్ పార్టీ హడావిడి
జగన్ విచారణ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా హడావిడి చేస్తోంది, సుల్తాన్ బజార్లోని సీబీఐ కార్యాలయం దగ్గరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ట్రూప్ బజార్ లో ధర్నా చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి