16, నవంబర్ 2011, బుధవారం
తెలంగాణ తేల్చేస్తున్నారా..?
తెలంగాణపై త్వరలోనే నిర్ణయం ప్రకిటించాలనుకొంటోంది కాంగ్రెస్ పార్టీ. దానికోసం వడివడిగా పావులు కదుపుతోంది. రాష్ట్రస్థాయిలో సంప్రదింపులు పూర్తి కావడంతో.. జాతీయ స్థాయి సంప్రదింపులపై దృష్టి పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ గులాంనబీ అజాద్ ఇంతకాలం చెప్పుకొచ్చినట్లుగానే.. యూపీఏ మిత్ర పక్షాలతో చర్చలు మొదలయ్యాయి. ఇవి పూర్తైన తర్వాతే.. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ కోర్ కమిటీ.. ఈ విషయంపై తీవ్రంగా చర్చించి.. ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకొంది. దీనికి అనుగుణంగానే డీఎంకే నేత టీఆర్ బాలుతో ప్రణబ్ ముఖర్జీ సమావేశమై చర్చలు జరిపారు. తెలంగాణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.. ఒకటీ రెండు రోజుల్లో.. యూపీఏలో మరో కీలక భాగస్వామి ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో ప్రణబ్ చర్చలు జరిపే అవకాశాలున్నాయి...
ఢిల్లీలో స్పీడ్ ఎందుకు పెరిగింది..?
సంప్రదింపులు వేగంగా జరుగుతాయా..?
తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం త్వరలోనే వెలువడుతుందా..?
తెలంగాణ అంశాన్ని ఇంతకాలం దాటవేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ హైకమాండ్.. ఇప్పుడు తొందరపడడానికి పార్లమెంట్ సమావేశాలే కారణంగా కనిపిస్తోంది. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణపై ముందడుగు వేయకుండా సమావేశాలకు వెళితే.. సొంతపార్టీ ఎంపీల నుంచే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్షం కూడా ఇరుకునపెట్టొచ్చు. అందుకే, ఏదో ఒకటి జరుగుతుందన్న ఫీలింగ్.. నేతల్లోకి పంపిస్తే, పరిస్థితిని కంట్రోల్ చేయవచ్చని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందులో భాగంగానే సంప్రదింపులు మొదలుపెట్టారు. అయితే.. తెలంగాణపై ఏదో ఓ ప్రకటనను పార్లమెంట్ సమావేశాల్లోపు చేస్తారా.. అంటే.. ఆ సంకేతాలు మాత్రం ఇంతవరకూ కనిపించడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి