16, నవంబర్ 2011, బుధవారం
టీఆర్‌ఎస్‌పై బాబు ప్రభావం
అన్ని సమస్యలూ తెలంగాణ అంశంతోనే ముడిపడిఉన్నాయని తరచూ చెప్పే టీఆర్‌ఎస్.. వ్యూహాన్ని మార్చుకొంది. తెలంగాణ కోసం పోరాడుతూనే ప్రజాసమస్యలపైనా దృష్టి పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ జిల్లాల్లో నేటి నుంచి ఆరు రోజుల పాటు పాదయాత్ర చేపట్టింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. నేతలు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ప్రజలతో మమేకమై.. ఉద్యమంపై వారిని మరింత చైతన్యవంతం చేస్తామని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు కాంగ్రెస్సే ప్రధాన అడ్డంకి అని ప్రచారాన్ని చేయనున్నారు..
తెలంగాణ అంశానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రజాసమస్యలపైనా ఈ యాత్రలో దృష్టి పెట్టాలని టీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు రైతుపోరు బాట తెలంగాణలో సాగుతుండడంతో, రైతు సమస్యలపైనా తామూ ఉద్యమించాలని భావిస్తున్నారు.
అయితే.. చంద్రబాబు యాత్రకూ.. తమ యాత్రకూ పోలిక లేదంటున్నారు టీఆర్‌ఎస్ నేతలు. ఆయన్ను చూసి చేయడం లేదంటున్నారు. ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికే పాదయాత్రలు చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంతో ఇప్పటికే బలపడ్డ టీఆర్‌ఎస్.. ఈ పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీలపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించాలని భావిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి