16, నవంబర్ 2011, బుధవారం
బాబు గూట్లో భయం..భయం
టీడీపీలో సీబీఐ కలకలం.. పైకి గాంభీర్యం.. లోలోపల భయం భయం.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆస్తులపై CBI విచారణకు హైకోర్ట్ ఆదేశించడం ఆ పార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధమంటూ పైకి చెబుతున్న చంద్రబాబు సైతం లోలోపల కంగారు పడుతున్నారు. దురుదేశపూర్వకంగా తన ఆస్తులపై పిటిషన్‌ను వేశారని ఆరోపిస్తున్నారు.
CBI విచారణ విషయంలో టీడీపీ పరిస్థితి అడకత్తెరలో పోకచక్కగా మారిపోయింది. విచారణ వద్దంటే ఓ సమస్య.. విచారణ జరిగితే మరో సమస్య. దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై పార్టీనేతలు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. న్యాయపరంగా ఎదుర్కోవాలా లేక రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలా అన్న అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లే అంశాన్ని సీనియర్ నేతలతో పాటు న్యాయనిపుణలతోనే చంద్రబాబు చర్చించనున్నారు. పిటీషనర్లు కోర్టుకు తెలిపిన పలు అంశాల్లో ఇప్పటికే కొన్ని కోర్టు తీర్పులు బాబుకు సానుకూలంగా ఉండడంతో వాటిని కోర్టు ముందు ఉంచాలనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయినా విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు తెలుగుతమ్ముళ్లు.
CBI విచారణ వ్యవహారంతో పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులపై చంద్రబాబు దృష్టి పెట్టారు. దీన్ని రాజకీయం ఎలా ఎదుర్కోవాలన్న దానిపై నేతలతో చర్చించనున్నారు. రాజకీయ దురుద్దేశ్యంతోనే బాబుపై అవినీతి బురద జల్లుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. పార్టీ నేతలతో ఇవాళ జరిగే సమావేశంలో.. సీబీఐ విచారణపై చంద్రబాబు తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి