23, నవంబర్ 2011, బుధవారం
చిరంజీవి ఫ్యామిలీలో విభేదాలు లేవంట
Categories :
chirnajeevi . entertainment . pavan . tollywood . TOP
పంజా ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో చిరంజీవి ఫ్యామిలీ విబేధాలంటూ వెలువడ్డ వ్యాఖ్యలకు తెరదించే పని చేసే ప్రయత్నం చేశారు హీరో అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ ఒంటరివాడు కాదని, అంతా కలిసే ఉన్నామని తెలిపారు. మీడియాలో వచ్చిన వార్తలు తనకు ఎంతో బాధకలిగించాయని, ఒక్క ఆడియో ఫంక్షన్‌కు రానంత మాత్రాన ఇంత గొడవ చేయడం సరికాదని బన్నీ అభిప్రాయపడ్డాడు. తమ ఫ్యామిలీలో నలుగురం హీరోలం ఉన్నామని.. ఏడాదికి రెండు చొప్పున ఎనిమిది ఫంక్షన్లు చేస్తామని, ఒక్కదానికి రానంత మాత్రాన పుకార్లు పుట్టించడం సరికాదన్నారు. చరణ్ ఊర్లో లేడని, తాను షూటింగ్ నుంచి వచ్చేసరికి ఆలస్యం అయ్యిందని అందుకే పంజా ఆడియో ఫంక్షన్‌కు వెళ్లలేకపోయానని వివరించారు. మా ఫ్యామిలీని ఎవరూ విడదీయలేరని కూడా బన్నీ చెప్పాడు.
నిజమేనా..?
పీఆర్పీ - కాంగ్రెస్ విలీనం ప్రతిపాదన దగ్గరనంచి చిరంజీవికి,పవన్ కళ్యాణ్‌కు మధ్య విబేధాలు పెరిగిపోయాయి. ఇద్దరూ బహిరంగంగా ఎక్కడా కలిసి కనిపించడం లేదు. యువరాజ్యం అధ్యక్షుడుగా ... ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను నానాతిట్లూ తిట్టిన పవన్‌కు, కాంగ్రెస్‌తో కలవడం ఏమాత్రం ఇష్టం లేదు. కానీ, చిరంజీవి మాత్రం పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని పట్టించుకోకుండా, రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసేశారు. దీంతో ఇద్దరిమధ్యా దూరం పెరిగింది. దీనికి తగ్గట్లే, పులి, తీన్ మార్ , పంజా ఆడియో ఫంక్షన్లకు చిరంజీవి హాజరు కాలేదు. ఈ మధ్య చిన్నా చితకా ఆడియో ఫంక్షన్లకు, డబ్బింగ్ సినిమాల ఫంక్షన్లకూ వెళుతున్న చిరంజీవి, సొంత తమ్ముడు ఆడియో ఫంక్షన్‌కు రాకపోవడం విచిత్రమే. తీన్ మార్ ఫంక్షన్లో కనీసం అల్లు అరవింద్, నాగబాబులైనా కనిపించారు.. ఈ సారి వాళ్లూ రాలేదు.. కనీసం రామ్ చరణ్, అల్లు అర్జున్‌లూ రాకపోయే సరికి (చరణ్ ఆ సమయంలో చైనాలో ఉన్నాడట) పవన్‌కు ఒళ్లు మండినట్లుంది. అందుకే... తనకు వారసత్వ అభిమానం వద్దంటూ స్టేజ్ పైనే కుండబద్దలు కొట్టి చెప్పాడు..
ఆరోజు పవన్ చెప్పిన డైలాగ్స్...
" వారసత్వంగా నాకు ఇది అవసరం లేదు. వారసత్వంగా నాకు అర్హత లేదు. కష్టపడి మీ అభిమానాన్ని నేను సంపాదించుకున్నాను. వారసత్వంగా సంపాదించుకోవడం లేదు. దానికోసం నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు.."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి