29, నవంబర్ 2011, మంగళవారం
మావోయిస్టుల వెనుక అదృశ్యశక్తి?
ఒక్కో అగ్రనేత అశువులు బాస్తున్నాడు. పోలీసుల చేతికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నాడు. మొన్న ఆజాద్.. నిన్న కిషన్ జీ.. రేపు.. మరో నేత.. ఎన్ కౌంటర్లు ఆగే సంకేతాలే లేవు. మావోయిస్టు పార్టీలోని కీలక వ్యక్తులను ఒక్కొక్కరినే తెలివిగా మట్టుబెడుతూ, ఎర్రసామ్రాజ్యంలోకి చొచ్చుకుపోతున్నాయి భద్రతాబలగాలు. కానీ, ఎంతమంది పెద్ద నేతలను మరణిస్తున్నా, మావోయిస్టుల కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. పైపెచ్చు.. మరింత చురుగ్గా సాగుతున్నాయి. దీనికి కారణం ఏమిటి..? ఇంతవరకూ అందరికీ తెలిసినట్లు, భద్రతా బలగాలు అనుమానిస్తున్నట్లు.. గణపతి నేతృత్వంలో మాత్రమే మావోయిస్టులు కార్యకలాపాలు సాగడం లేదు. మరో నాయకత్వం వీరిని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు గణపతికి కూడా ఆదేశాలు జారీ చేసే శక్తి తెరవెనుక ఉన్నట్లు సమాచారం. సీఆర్పీఎఫ్ బలగాలకు చిక్కిన సవ్యసాచి పాండే ల్యాప్ టాప్ ను డీకోడ్ చేసిన భద్రతా బలగాలు.. అందులో దీనికి సంబంధించిన వివరాలు చూసి అవాక్కయ్యారు. అందరికీ తెలిసిన నాయకత్వం కాక, మరో నాయకత్వం మావోయిస్టులను నడిపిస్తోందన్న నిర్ధారణకు వచ్చారు. అయితే.. ఆ శక్తి, ఆ నాయకత్వం ఎవరన్నదే ఇప్పటివరకూ పోలీసులకు అంతుబట్టలేదు.. ? అది స్వదేశీ శక్తా.. లేక విదేశీ శక్తా..? ఇదే ఇప్పుడు తేలాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి