31, అక్టోబర్ 2011, సోమవారం
కూల్‌డ్రింక్స్‌తో కష్టమే..?
Categories :
cooldrinks . health . news . TOP . violence
సాఫ్ట్‌డ్రింక్స్ అతిగా తాగుతున్నారా?
ఐతే మీలో మార్పు తప్పదు...
పట్టరాని కోపం.. కమ్మేసే మత్తు.
మైకంలో రాక్షసులుగా మారొచ్చు...
టీనేజర్స్‌కు పెనుప్రమాదం
నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. కూల్ డ్రింక్స్ తాగితే ఇంత సీనుందా అని సందేహించకండి. అదేపనిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగితే..నిస్సందేహంగా కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు హార్వర్డ్ పబ్లిక్ స్కూల్ ప్రొఫెసర్..డేవిడ్ హెన్మెన్‌వే.
సాఫ్ట్ డ్రింక్స్ ఎఫెక్ట్స్ పై వారు చేసిన సర్వేలో వెలుగు చూసిన నిజాలు డేవిడ్ హన్మెన్‌వే టీమ్‌ను నిర్ఘాంతపరిచాయి. బోస్టన్ నగరంలో 14 నుంచి 18 ఏళ్ల పబ్లిక్ స్టూడెంట్స్‌ను ఆ బృందం ఇంటర్వ్యూ చేసింది. మొత్తం 1878 మందిని స్టడీకి ఎంచుకుని రకరకాల ప్రశ్నలేసింది. వారానికి ఐదు కేన్ల నాన్ డైట్ సాఫ్ట్ డ్రింక్స్‌ను సేవించినవారిలో అగ్రెస్సివ్ పర్సంటేజ్ ఎక్కువ కనిపించిందట. కేన్ అంటే..355 మిల్లీలీటర్లు. తక్కువగా తాగేవారితో పోలిస్తే..9 నుంచి 15 శాతం మందిలో కోపం పాళ్లు ఎక్కువని ఆ సర్వేలో తేలింది. మైక్రో న్యూట్రియంట్స్ లభ్యం కాకపోవడం, స్వీట్ డోస్ ఎక్కువ కావడంతో.. ఇంచుమించు ఆల్కహాల్ తాగినవారితో సమానంగా ప్రవర్తిస్తారట. ఆ టైంలో టీనేజర్స్ బిహేవియర్ చాలా ప్రమాదకరంగా ఉందట.
చాకునో, గన్‌నో తీసుకుని..తమ ఏజ్ గ్రూప్‌వారిపై, కుటుంబసభ్యులపై, భాగస్వాములపై దాడులు చేశారని సర్వేలో తేలింది. సాఫ్ట్ డ్రింక్ ఓవర్ డోస్ ప్రభావంతోనే ఈ విధంగానే ప్రవర్తిస్తారని సర్వేలో తేలింది కానీ..ఈ విధంగా ప్రవర్తించడానికి స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా తెలుసుకోలేదు.
వారానికి 14 సాఫ్ట్ డ్రింక్ కేన్లు తాగినవారిలో 43 శాతం మంది గన్, చాకులతో దాడిచేసిన సందర్భాలున్నాయి. అందులో 27శాతం మంది పార్టనర్‌ను హింసించగా.., 58 శాతం మంది సేమ్ ఏజ్ గ్రూప్ వారితో తగవుపడ్డారని ఆ సర్వేలో తేలింది. సో ఇప్పుడర్ధమైందిగా...ఏదైనా అతి..అనర్ధమే అని.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అస్సలు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అన్నవి అతి చెత్తవి. బాగా చల్లగా తగినప్పుడు కాస్సేపు నాలుకకి సమ్మగా ఉంటాయి గానీ, వీటి వలన శరీరానికి ఒక ఉపయోగం ఉండదు. పైపెచ్చు వీటిలో ఉండేదంతా చెత్తే.