31, అక్టోబర్ 2011, సోమవారం
ఆపరేషన్ రివర్స్
టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీన మవుతుంది..
నిన్నటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాట..
కాంగ్రెస్సే టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతుంది..
ఇది తాజాగా కేసీఆర్ చెబుతున్న మాట..
కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న మరో ఎమ్మెల్యే టీఆర్‌ఎస్‌లోకి జంప్ కావడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. టీఆర్‌ఎస్‌ది పైచేయి అయ్యింది. ఒకప్పటి ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా రివర్స్‌గా మారింది.
టీఆర్‌ఎస్‌తో పోత్తు పెట్టుకొని 2004 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సిఎంగా బాధ్యత చేపట్టిన వెంటనే పార్టీని బలోపేతం చేయడానికి ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారభించారు. టీఆర్‌ఎస్‌ను చీల్చారు.. ఆ పార్టీ తరపున గెలిచినవారిలో 10మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారు.
వైఎస్ మరణం అనంతరం కాంగ్రెస్‌లో పట్టు ఉన్న నాయకుడు కరువయ్యాడు. తెలంగాణ ఉద్యమం బలపడింది. తెలంగాణపై కాంగ్రెస్ అనుసరిస్తు వైఖరితో ఇప్పటికే టీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధలు విసిగిపోవడం టీఆర్‌ఎస్ వరంగా మారింది. దీన్ని అదనుగా చేసుకొని ఆపరేషన్ రివర్స్ మొదలుపెట్టారు కేసీఆర్.
టీడీపీని టార్గేట్ చేసుకొని ముగ్గురు ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగుకొన్న టీఆర్ఎస్ ఇప్పడు కాంగ్రెస్‌పై దృష్టి పెట్టింది. మరి కొంతమంది నేతలు కూడా టీఆర్‌ఎస్‌లోకి వస్తారని జూపల్లి టీమ్ చెప్పడం చూస్తుంటే.. తెరవెను పావులు భారీ స్థాయిలోనే కదులుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ రివర్స్‌ను కాంగ్రెస్ అడ్డుకోగలుగుతుందా..? తమ పార్టీలో నుంచి నేతలు జారిపోకుండా జాగ్రత్త పడుతుందా.? లేదంటే.. కేసీఆర్ ప్లాన్‌కు చిత్తవుతుందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి