31, అక్టోబర్ 2011, సోమవారం
కిరణ్ సర్కార్ కు గండం ?
Categories :
cm . congress . kiran kumar . POLITICS . TOP
కారెక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారా?
కిరణ్ సర్కార్‌కు ప్రమాదం పొంచి ఉందా..?
గత కొంత కాలంగా కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు ఉంటాయని జరిగిన ప్రచారం నిజమైంది. రాజయ్య,జూపల్లి,అనుబంధ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీని వీడుతునట్లు ప్రకటించి రాజకీయ దుమారాన్ని సృష్టించారు. అంతటితో ఆగక, తమవెంట మరికొందరు వస్తారంటూ ప్రకటించడంతో కాంగ్రెస్‌లో కలకలం రేగింది.
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఇప్పటికే MLA పదవులకూ రిజైన్ చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కొమటిరెడ్డి, చిరుమర్తి లింగయ్య కూడా అసెంబ్లీ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. వీరిద్దరు కూడా త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్ తీర్ధం పుచ్చుకోనునట్లు తెలుస్తోంది.మరో ముగ్గురు..నలుగురు ఎంపిలు కూడా ఎమ్మెల్యే బాటలో నడువనునట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.
కాంగ్రెస్ హైకమాండ్‌పై బత్తిడి పెంచే క్రమంలోనే తాజా రాజీనామాలను కేకే లాంటి నేతలు ప్రోత్సహిస్తునట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీకి , శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేసిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు రిజైన్‌ల ఆమోదానికి బత్తిడి తెస్తే కిరణ్ సర్కార్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఒక వేళ కాంగ్రెస్ సర్కార్ కొనసాగినా... రానున్న రోజుల్లో 30 నుంచి 40 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగితే ఎదురుకునే సత్తా ఉందా అనే అనుమానం కలుగుతోంది. తెలంగాణకు అనుకూలమని కాంగ్రెస్ హైకమాండ్ చెబితే తప్ప.. రాజకీయ భవిష్యత్తు సాఫీగ సాగదన్న భయం ఆ ప్రాంత కాంగ్రెస్ నేతల్లో ఉంది. తెలంగాణకు నో అంటే మాత్రం వీరిని కాపాడుకోవడానికి సీఎం కిరణ్, పీసీసీ బొత్సలు మరింత శ్రమించాల్సి ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి