11, సెప్టెంబర్ 2011, ఆదివారం
ఐదున్నర లక్షల బాలాపూర్ లడ్డూ
బాలాపూర్ లడ్డూ మరోసారి తన ఖ్యాతిని చాటుకొంది. గత ఏడాదికన్నా ఈసారి వేలం పాటలో పదివేలు ఎక్కువగా పలికింది. 5 లక్షల 45 వేలు చెల్లించి కొలనుమోహన్ రెడ్డి, కొలను కృష్ణారెడ్డిలు లడ్డూను ఈ సారి దక్కించుకున్నారు. దీంతో రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ బాలాపూర్ వాసులకే లడ్డూ దక్కినట్లయ్యింది. నిరుడు, అంతకు ముందు ఏడాది ఇతర ప్రాంతాల వారు లడ్డూ దక్కించుకున్నారు. కొలను సోదరులు లడ్డూను దక్కించుకోవడం ఇది ఎనిమిదోసారి. బాలాపూర్ లడ్డూ దక్కించుకున్నప్పుడల్లా తమకు కలిసి వస్తుందని, అందుకే, లడ్డూను పాడుకున్నామని కొలనుసోదరులు తెలిపారు. 1994 నుంచి మొదలైన బాలాపూర్ లడ్డూ వేలం నిరాటంకంగా కొనసాగుతోంది. ప్రతీ ఏడాది ఈ లడ్డూ ధర పెరుగుతూనే వస్తోంది. తొలి ఏడాది కేవలం 450 రూపాయలు పలికిన లడ్డూ ఇప్పుడు 5 లక్షల 45 వేలకు చేరింది. బాలాపూర్ ను ఆదర్శంగా తీసుకొని ఇతర ప్రాంతాల్లో లడ్డూ వేలాలు నిర్వహిస్తున్నా, క్రమంగా ధరలు పెరుగుతున్న ఆనవాళ్లు మాత్రం లేవు. రియల్ బూమ్ ఎక్కువగా ఉన్నప్పుడు మహేశ్వరంలో లడ్డూ పదిహేను లక్షలు పలికింది. ఆ తర్వాత మాత్రం లక్షలోపే పరిమితం అయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి