ఇంగ్లీష్ దేశాన్ని అల్లర్లు అల్లకల్లోలం చేస్తున్నాయి. ఓ నల్ల జాతీయుడిని అన్యాయంగా పోలీసులు కాల్చి చంపారన్న విషయం లండన్ ను అగ్నిగుండంగా మార్చేసింది. అగ్రరాజ్యాల్లో ఒకటైన బ్రిటన్ ను దోపిడీ రాజ్యంగా మార్చేసింది. ఇప్పుడు లండన్, బర్మింగ్ హామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా దాడులు, అల్లర్లు, లూటీలు. షాపుల్లోకి అల్లరిమూకలు చొరబడి దొరికింది దోచుకుంటున్నాయి. పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అల్లర్లు అదుపుకాకపోగా, రోజురోజుకూ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. సోనీ కంపెనీకి చెందిన అతిపెద్ద గోడౌన్ కూడా ఆందోళనకారుల ఆగ్రహజ్వాలకు బూడిదయ్యింది. ఎన్నో చారిత్రక కట్టడాలు మంటల్లో మాడి మసైపోతున్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి బ్రిటన్ మీడియా తీసిన కొన్ని ఫోటోలు ఈ కింద అందిస్తున్నాం. వీటిని చూస్తే, అల్లర్లను కూడా ఇంత అందగా తీయొచ్చా అనిపిస్తుంది. అనుమానముంటే మీరూ చూడండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి