15, జులై 2011, శుక్రవారం
సర్పరూపంలో సత్యసాయి?
మహా సమాధి రూపంలో సత్యసాయి దర్శనమిస్తున్న వేళ పుట్టపర్తి ప్రశాంత నిలయంలో ఓ సర్పం హల్చల్ చేసింది. ఉదయం భక్తులు మహాదర్శనం కోసం వేచి చూస్తున్న సమయంలో ఓ నాగుపాము ప్రశాంతినిలయంలోకి వచ్చింది. బాబానే సర్పం రూపంలో కనిపించారని కొంత మంది భక్తులు చెబుతున్నారు. గతంలోనూ ఓ పాము పుట్టపర్తిలో హంగామా చేసింది. ఏప్రిల్ 24,2011 న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సఫాయా ఇంట్లోకి పాము ప్రవేశించింది. తర్వాత రోజు దానిని పట్టుకున్నారు. నాడు సఫాయా ఇంట్లో...నేడు ప్రశాంతి నిలయంలో పాములు సంచరించడంతో పుట్టపర్తికి నాగుపాములకు ఏదో సంబంధం ఉందని భక్తులు భావిస్తున్నారు. ఇదంతా సత్యసాయి మహిమగా చెప్పుకుంటున్నారు... సత్యసాయే సర్పరూపంలో తన మహిమను ప్రదర్శిస్తున్నారంటూ భక్తులు పుట్టపర్తిలో చెప్పుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి