
ఢిల్లీకి చెందిన ఐదుగురు యువకులు 355 మంది ప్రాణాలను రక్షించారు. ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి న్యూయర్క్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గాల్లో టేకాఫ్ చేసిన కొద్ది నిమిషాలకే ఇంజన్‌లో నిప్పు రవ్వలు చెలరేగాయి. వీటిని ఇంటిపై నుండి చూసిన యువకులు వెంటనే పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే, విమానాన్ని వెనక్కి రప్పించారు. ఇంజన్‌లో లోపాన్ని గుర్తించారు. ప్రమాదాన్ని త్వరగా గుర్తించడంతో.. పెను ప్రమాదం తప్పింది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి