22, డిసెంబర్ 2009, మంగళవారం
అయినవారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో
సామెత చెప్పినట్లు అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో పెట్టడం మనవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకులైతే ఈ విషయంలో ఆరితేరిపోయారు. తెలంగాణ, సమైక్య రాష్ట్ర వివాదాలతో అట్టుడుకుతున్న మన రాష్ట్రంలో.. ప్రభుత్వ తీరు ఈ విషయాన్నే రుజువు చేస్తోంది. దాని ఫలితమే.. విజయవాడ ఎంపీ లగడపాటి రాజనాటకం.
సీన్ వన్....
కేసీఆర్
సెప్టెంబర్ 29.. 2009 ... కరీంనగర్ నుంచి.. నిరాహారదీక్షకు బయల్దేరారు.. కేసీఆర్. తెలంగాణపై ప్రకటన చేసేంతవరకూ.. ఆమరణ దీక్ష కొనసాగించాలన్నది.. కేసీఆర్ ప్లాన్. ఈ దీక్ష గురించి రాష్ట్రమంతా అప్పటికే తీవ్రమైన చర్చసాగుతోంది. వేదికైన రంగథాంపల్లిలోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే.. కరీనంగర్నుంచి.. దీక్షా వేదిక వద్దకు వెళ్లేవరకూ రక్షణ కల్పిస్తామంటూ వ్యూహాత్మకంగా.. తమ వాహనంలో కేసీఆర్‌ను ఎక్కించుకున్నారు పోలీసులు. అంతే.. అక్కడి నుంచి మొదలైంది హై డ్రామా. మెదక్ జిల్లాలోని రంగథాంపల్లికి చేరాల్సిన వాహనాన్ని... రూట్లు మార్చుతూ.. ప్లాన్లు మార్చుతూ... ఖమ్మంలోని జడ్జి ఇంటికి తీసుకువెళ్లారు..
లగడపాటి
ఇది కూడా దాదాపుగా అలాంటి సీనే. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతోందని కేంద్రహోంమంత్రి చిదంబరం ప్రకటించగానే.. జగడం మొదలుపెట్టారు... బెజవాడ ఎంపీ లగడపాటి. ఢిల్లీలోనే ప్రెస్‌మీట్ పెట్టి.. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ముందు దీక్ష చేస్తానని అనౌన్స్ చేశారు. సమైక్యరాష్ట్రం వచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు. అన్నట్లుగానే.. హైదరాబాద్‌కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే రాజగోపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. నగరంలోని పహాడిషరీఫ్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కొంతసేపు ఉన్నతర్వాత.. రాజగోపాల్.. సీఎం ఇంటికి వెళ్లిపోయారు. ఎలాంటి నిర్భంధమూ లేకుండా లగడపాటిని వదిలేసినందుకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగరంలో అప్పటికే ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో.. అత్యంత జాగ్రత్తగా వ్యవహిరంచాల్సిన పోలీసులు.. అలసత్వం వహించారు. సీఎం ఇంటినుంచి బయటకు వచ్చి.. నేరుగా శాసనసభకు వెళ్లారు. అప్పుడూ ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి ఎల్.బి.స్టేడియం వరకూ తన అనుచరులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పాదయాత్ర చేశారు. స్టేడియంలోకి వెళ్లేదాకా చూస్తూనే ఉన్న పోలీసులు.. ఆ తర్వాత మాత్రం.. బలవతంగా అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అర్థరాత్రి తర్వాత.. చక్కగా జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తీసుకెళ్లి వదలిపెట్టారు..
తేడా
కనీసం పాదయాత్ర కూడా చేయని కేసీఆర్‌ను అరెస్ట్ చేసి.. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు.. లగడపాటి పాదయాత్ర చేసినా.. ఎల్.బి.స్టేడియంలో ఆందోళన చేసినా.. ఎందుకు వదిలేశారు? దీనికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి..
సీన్ టు...
కేసీఆర్
సీన్ వన్‌లో ప్రవర్తించినట్లే.. ఆ తర్వాత కూడా పోలీసులు వ్యవహరించారు. ఎలాంటి దీక్షా చేయకపోయినా.. ఎలాంటి గొడవా చేయకపోయినా.. కేసీఆర్‌పై మాత్రం.. వీలున్నన్ని కేసులు పెట్టారు. ఐపీసీ సెక్షన్లు 114, 117, 143, 120 బి, 153 బి, 506 కింద.. రకరకాల కేసులను నమోదు చేశారు. ఖమ్మంలోని మెజిస్ట్రేట్ శ్రీరాంమూర్తి ఎదుట హాజరుపరిచారు. వీటి ఆధారంగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో.. కేసీఆర్‌ను సబ్‌జైలుకు తరలించారు.
లగడపాటి
విజయవాడ ఎంపీ రాజగోపాల్ విషయంలో మాత్రం.. పోలీసులు ఎక్కడా ఈ విధంగా వ్యవహరించలేదు. అసలు లగడపాటిపై కేసులు పెట్టాలని గానీ.. ఆయన్ను అరెస్టు చేసి.. మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని గానీ ఎక్కడా ప్రయత్నించలేదు. హడావిడి చేసినప్పుడు అదుపులోకి తీసుకోవడం.. ఆ తర్వాత వదిలేయడం.. అంతకు మించి మరోపని చేయలేదు. విజయవాడలో నిరాహారదీక్ష మొదలుపెట్టినా దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. నాలుగు రోజులు దీక్ష చేసినా.. రోజూ వందలాది మంది.. ఆ దీక్షా శిబిరం వద్ద జమకూడుతున్నా.. ప్రేక్షకపాత్రమే పరిమితమయ్యారు. చివరకు.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను.. రాజగోపాల్ స్వయంగా విరగగొట్టినా.. ఒక్కకేసునూ ఆయనపై పెట్టలేదు.
కేసీఆర్ దీక్ష చేయడానికి బయలుదేరే సమయానికి కరీంనగర్లో 144 సెక్షన్లేదు.. కనీసం దీక్షా శిబిరం వద్దకూడా.. ఆ సెక్షన్‌ను విధించలేదు. అయినా టిఆర్ఎస్ చీఫ్ అరెస్ట్ అయ్యారు. అదే విజయవాడలో మాత్రం నాలుగురోజులుగా ఈ సెక్షన్ అమలులో ఉంది. అయినా.. రాజగోపాల్ దీక్ష కొనసాగింది. వందలాది మంది కార్యకర్తలు ధర్నాలు.. ఆందోళనలు చేశారు. దీక్షా శిబిరం వద్ద బైఠాయించారు.. వీరిని అరెస్ట్ చేయడం సంగతి అటుంచితే... కనీసం చెదరగొట్టే సాహసాన్ని పోలీసులు చేయలేకపోయారు.. ఎందుకని..?
కేసీఆర్ కూడా ఎంపీనే.. రాజగోపాల్ కూడా ఎంపీనే.. ఇద్దరిదీ ఒకేస్థాయి.. ఇంకా చెప్పాలంటే.. ఓ పార్టీకి అధ్యక్షుడిగా.. కేసీఆర్‌దే కాస్తోకూస్తో పైచేయి కావచ్చు. కానీ.. ఆయనకు అడుగడుగునా అడ్డుపడ్డ పోలీసులు.... లగడపాటి అడుగులకు మడుగులు ఎందుకు వత్తాల్సి వచ్చింది.
చట్టం ముందు అంతా సమానంగానే ఉండాలి. ముఖ్యమంత్రి చెప్పింది కూడా అదే. పైగా.. కేసీఆర్, లగపాటిల వ్యవహారంలోనే.. సీఎం మాట్లాడింది కూడా.. మరి ఈ ఇద్దరినీ ఒకేలా చూస్తోందా...
సీన్ 3...
కేసీఆర్
కేసీఆర్ ను ఖమ్మంజైల్లో ఉంచిన తర్వాత.. ఎవరినీ కలవడానికి అనుమతించలేదు. జైల్లో 30 గంటల పాటు.. దీక్ష కొనసాగించిన తర్వాత.. ఆయన్ను బలవంతంగా ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పోలీసుల నిర్భంధం తీవ్రంగానే కొనసాగింది. ఆయన్ను కలవడానికి.. కనీసం కుటుంబసభ్యులను కూడా అనుమతించలేదు. వైద్యసౌకర్యాలు ఎక్కువగా ఉండే రాజధానికి తరలించాలని కేసీఆర్ చేసుకున్న విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు... మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే గానీ.. సర్కార్ తీరులో మార్పు రాలేదు.
లగడపాటి
ఇక లగడపాటి విషయానికొస్తే.. ఆయన్నూ బలవంతంగానే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ.. ఖమ్మంతో పోల్చితే.. ఇక్కడ వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగు. కార్పొరేట్ ఆస్పత్రికి సరిసమానంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. విజయవాడకు ఎంపీకి మాత్రం ఆ బెజవాడ ఆస్పత్రి ఏమాత్రం నచ్చలేదు. అందుకే నిమ్స్‌లో తనకు చికిత్స చేయించాలంటూ బెట్టు చేశారు. ఇక ట్రీట్మెంట్ సంగతి పక్కన పెడితే.. హాస్పిటల్లో పోలీస్ కస్టడీలో ఉన్నా ఎంపీగారి ఇష్టారాజ్యంగానే సాగింది. కేసీఆర్‌కు విధించిన రిస్ట్రిక్షన్స్ ఏవీ ఇక్కడ మచ్చుకు కూడా కనిపించవు. ఆయనకు కావల్సినవారంతా.. దర్జాగా ఆయన గదిలోకి వెళ్లారు.. వచ్చారు. గంటల తరబడి చర్చలూ జరిపారు. వీరెవరినీ పోలీసులు అడ్డుకోలేదు. ఈ విషయం తెలిసినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు.
అంతేకాదు.. సడన్‌గా అర్థరాత్రి సమయంలో.. ఆస్పత్రినుంచి బయటకు వచ్చిన లగడపాటి.. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. క్వాలిస్‌లో ఎక్కి పరారయ్యారు. వాహనంలోకి ఎక్కుతున్న సమయంలో కార్యకర్తలు ఎంపీపై పడకుండా పోలీసులు అడ్డుకున్నారే గానీ... ఎక్కడికి వెళుతున్నారని అడిగే సాహసమూ చేయలేదు. చివరకు గేట్లు వేయడానికి ప్రయత్నించినా.. వాటిని ఢీకొట్టి మరీ పారిపోయారు. అంతా అయ్యాక.. ఏదో హడావిడిగా సెర్చింగ్ మొదలుపెట్టారు.. పైగా.. హాస్పిటల్ నుంచి పారిపోయినందుకు కేసు కూడా ఏదీ పెట్టమని విజయవాడ పోలీసులు స్పష్టమైన ప్రకటన చేశారు...
ఇక సీన్ కట్‌చేస్తే.. 15 గంటల సస్పెన్స్ తర్వాత లగడపాటి.. నిమ్స్ ముందు సడన్‌గా ప్రత్యక్షమయ్యారు. ఆరురోజుల పాటు నిరహారదీక్ష చేసినప్పటికీ.. ఎంతో ఉత్సాహంగా.. ఓ అథ్లెట్‌ను తలపిస్తూ.. హాస్పిటల్లోకి పరుగులు పెట్టారు. నేరుగా ఐసీయూలోకి వెళ్లి బెడ్‌పై ఎగిరి దూకి పడుకున్నారు. ఇక్కడ మాత్రం.. మానవహక్కుల సంఘం జోక్యం చేసుకోలేదు.. ప్రభుత్వమూ స్పందించలేదు.. అయినా.. లగడపాటి మాత్రం... కోరుకుంటున్ననిమ్స్లో అడ్మిట్ అయిపోయారు.. అంటే.. తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్‌కు ఓ న్యాయం... సమైక్యకోసం ఉద్యమిస్తున్న రాజగోపాల్‌కు మరో న్యాయమా? మరి సీఎం చెప్పినట్లు చట్టం ఇద్దరి విషయంలోనూ ఒకేలా.. వ్యవహరించిందనుకుందామా? లేక ఇదంతా ప్రభుత్వం ఆడుతున్న రాజనాటకమా?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కె సి అర్ దీక్ష కు ముందు చాలా వేషాలు వేసాడు పెట్రొల్ కాన్ల తో మనుషులని పెట్టి నా కేమయినా అయితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ప్రజలను భయాందొళనకు గురి చేసాడు. ఒక సారి దీక్షకు కూచున్నాక శాంతియుతంగా విరమింపచేయడం అసాధ్యం అనిపించేలా పరిస్థితులు స్రుష్టించాడు అందుకే పొలిస్ అరెస్ట్ చేయవలసివచ్చింది అలాగే రాజగోపాల్ ని కూడా రెచ్చగొట్టింది తె రా స వాళ్ళే హైదరాబాద్ కి రానివ్వం అని కాళ్ళు విరగగొడతాం అని అందుకే పంతానికి హైద్ వచ్చాడు.పోలీసు ల పాత్ర దేముంది ఆ క్షణంలో అలా జరుగుతుందని వూహించలేక పొయారు.
Prabuthvam chesinadhi nayayama, anyayama ani pakkana pdithe asalu,,, Vella iddarini comparijan cheyadam ante iddari Vesyalanu comparijan cheyadam lantidhe.........