ఆరు రోజుల పాటు ఏక ధాటిగా నిరాహారదీక్ష చేసినవారు.. ఎలా ఉంటారు.. వాస్తవం చెప్పాలంటే.. కనీసం లేచి ఓ పదినిమిషాలు కూడా సరిగ్గా నిలబడలేరు. కానీ.. జగడాలమారి మన లగడపాటి రాజగోపాల్‌కి మాత్రం ఇవన్నీ మినహాయింపు. ఎన్ని రోజుల ఉపవాసమైనా... తన ఒంట్లోని అణువంత శక్తిని కూడా తగ్గించలేదని నిరూపించుకున్నారు. అందుకు.. నిమ్స్ హాస్పిటల్ దగ్గర ఆయన చేసిన ఫీట్లే అందుకు నిదర్శనం.ఆదివారం అర్థరాత్రి సమయంలో విజయవాడ హాస్పిటల్‌నుంచి.. అందరి కళ్లెదురే దర్జాగా పారిపోయిన ఎంపీ లగడపాటి రాజగోపాల్.. 15 గంటల పాటు తన ఆచూకీని ఎవరికీ తెలియనివ్వకుండా.. అంత్యంత గోప్యంగా వ్యవహరించారు. చివరకు.. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు సడన్‌గా నిమ్స్ హాస్పిటల్ దగ్గర ప్రత్యక్షమయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఎలా వచ్చారన్న విషయంలో స్పష్టత లేకున్నా.. ఆయన వ్యవహరించిన తీరుమాత్రం.. ఎంపీ ఆరోగ్య సమస్యలపై మాత్రం అందరికీ స్పష్టమైన అవగాహన కల్పించింది. రన్నింగ్ రేస్‌లో పరుగులు పెట్టినట్లుగా.. నిమ్స్ ఆవరణలోకి రావడమే ఆలస్యం.. పరుగందుకున్నారు లగడపాటి. కెమెరాలకు, పోలీసులకూ చిక్కకుండా.. ముంబైపై దాడులు చేసిన టెర్రరిస్టులు పరుగులు తీసినట్లుగా.. నిమ్స్‌లోకి దూసుకెళ్లారు. ఎక్కడో లోపల ఉన్న ఐసీయూలోకి.. పరుగెత్తుకు వెళ్లి.. పోల్ జంప్ చేసినట్లు ఒక్క ఉదుటున ఎగిరి బెడ్‌పై దూకారు. అంతే.. ఆయన్ను మైకం కమ్మేసింది. అసలు నటనంతా అక్కడే మొదలయ్యింది. అమితాబచ్చన్ కూడా అదిరిపోయే లెవల్లో బిక్కమొకం వేసి.. కనురెప్పలు కూడా తెరవలేనంత స్థితిలోకి వెళ్లిపోయినట్లు సీన్ సృష్టించారు..రాజగోపాల్. అప్పటిదాకా పరుగుపెట్టడంలో ఉన్నంత ఉత్సాహం బెడ్‌పైకి ఎక్కగానే ఆవిరైపోయిందా..? అసలు ఆరు రోజులు నిరహారదీక్ష చేసిన వ్యక్తి పరుగుపెట్టేంత ఓపిక ఉంటుందా? ఈ పదిహేనుగంటల్లో లగడపాటి ఏం చేశారు? విజయవాడ హాస్పిటల్ నుంచి పారిపోతున్నా పోలీసులు ఎందుకు చూస్తూ ఉండిపోయారు? అసలు... రాజగోపాల్‌కు నిమ్స్‌లో మాత్రమే చికిత్స దొరికేంత అరుదైన వ్యాధేమైనా వచ్చిందా? పైగా.. తానే ప్రాతినిథ్యం వహిస్తున్న బెజవాడలోని అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి చికిత్సపైనే నమ్మకంలేని రాజగోపాల్.. ఈ ఆరేళ్లుగా ఆస్పత్రిని ఎందుకు పట్టించుకోలేదు? నిరహారదీక్షతో రాజగోపాల్‌కు వచ్చిన నీరసానికే విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స దొరకడం లేదంటే.. ఇక సామాన్యులకు వచ్చే మహామహా రోగాలకు అక్కడ ట్రీట్‌మెంట్ దొరుకుతుందా? అంటే రాజగోపాల్‌వి మాత్రమే ప్రాణాలా.... బెజవాడ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ చేసుకునేవి ప్రాణాలు కాదా?
ఇక ఈ విషయం పక్కన పెడితే.. సమైక్య ఉద్యమం ఎంత నీచంగా సాగుతుందో.. రాజ్‌గోపాల్ వ్యవహించిన తీరు అద్దం పడుతోంది. ఇప్పటివరకూ సమైక్య ఉద్యమానికి పూర్తిగా నేతృత్వం వహించింది.. ముందుండి సాగిందీ.. రాజ్‌గోపాల్ మాత్రమే. ఇతర పార్టీల వారు నిరాహారదీక్షలు చేస్తున్నా.. హల్‌చల్ చేస్తోంది.. అందరినీ పరామర్శించి దీక్ష మొదలుపెట్టింది ఆయనే. అంతేకాదు.. రాష్ట్ర ఎంపీలందరిలోనే.. రాజీనామా సమర్పించిన వన్‌మ్యాన్ ఆర్మీ. సమైక్యంగా ఉందామంటూ.. కోట్లాదిరూపాయల ఖర్చుతో టీవీయాడ్స్ కూడా ఇచ్చిన లీడర్ ఆయన. అందుకని.. రాజ్‌గోపాల్‌నే ఈ సమైక్య ఉద్యమం మొత్తానికి ముందున్న నాయకుడిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి అలాంటి లీడరే.. ఇలా చీప్‌గా పరుగులు పెడుతూ.. దొంగనాటకాలు ఆడుతూ.. ఆస్పత్రిలో చేరితే.. మిగిలిన ఉద్యమాన్ని ఎవరైనా ఎలా అర్థం చేసుకుంటారు.. రాజ్‌గోపాల్ చేసిన పనితో.. మొత్తం సమైక్య ఉద్యమాన్నే అనుమానించాల్సి వస్తోంది.
21, డిసెంబర్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Superrrrr....
ఇలాంటి ఆంధ్రా కమేడియన్స్ అవసరం ఇప్పుడు ప్రజలందరికీ ఉంది.
ఆంధ్రోల్లందరూ ఇలాంటి దొంగలే.
once more Lagadapaati once more. :D
well said..
@ అజ్ఞాత : రాజ గోపాల్ ని అను చిరంజీవిని అను , అంతె కాని ఆంధ్రా వాళ్ళని అంటే నేను ఊరుకోను.
నువ్వు ముందు ఒక ప్రత్యెక బ్లాగ్ పెట్టుకో తర్వాత ప్రత్యెక తెలంగాణా గురించి గోల చేద్దువు గానీ
@Apparao we know what happens "when we throw stone on shit" ....
So better Dont throw ...Its really SHIT..
@ అజ్ఞాత: Koma lo ki velle stage lo unna KCR next day naduchukuntu intiki etla velladu?????
కోమాలోకి పోతున్నాడు అని గొడవచేసి, రెండో రోజే ఇంటికి హాయిగా పోయినోడు లాగానే ఇది.
దీనికి సమైక్య ఉద్యమానికి link లెడితే, kcr కు తెలంగాణోళ్లకు link ఎట్టినట్లే!! మరి వాని బూతు నోరు లాంటిదే తెలంగాణా వాళ్లందరిదీ అందామా? వాడిలాగానే తెలంగాణా ఉద్యమం లోకి వెళ్లినోళ్లందరూ స్వార్ధపరులే, దబ్బులు కూడెసే రకమే అందామా? kcr లాగానే తెలంగాణోళ్లందరూ మందు బాబులందామా?
http://anvvapparao.blogspot.com/2009/12/blog-post_24.html