మెగాస్టార్‌కి అభిమానులు గుర్తొచ్చారు. చిరంజీవికి.. ప్రజారాజ్యానికి బలమేదైనా ఉందా అంటే.. అది ఆయన అభిమానులే అని చెప్పాలి. పార్టీ పెట్టమని ప్రోత్సహించింది.. సొంతపనులు మానుకొని.. ఇల్లూ ఒళ్లూ గుళ్లచేసుకొని పగలనక, రాత్రనకా.. ఎండనకా.. వాననకా.. కష్టపడి ఊరూ వాడా ర్యాలీలు చేసి.. అన్న రాజకీయాల్లోకి రావాలంటూ.. ర్యాలీల మీద ర్యాలీలు చేశారు.. మెగా ఫ్యాన్స్. ఆ ఊపుతోనే.. వెండితెరనుంచి జనం మధ్యకు వచ్చారు చిరు. అన్న రాజకీయాల్లోకి రావడంతో.. టికెట్లు వస్తాయని ఆయన ఫ్యాన్స్ విపరీతంగా కష్టపడ్డారు. కానీ.. టికెట్ల కేటాయింపు దగ్గరుకు వచ్చేసరికి సీన్ రివర్స్ అంతయ్యింది. అంతొద్దు.. ఇది చాలంటూ.. అభిమానులకు కేవలం ప్రచారానికే పరిమితం చేశారు చిరంజీవి. వలసలు వచ్చిన వారికీ.. డబ్బుకట్టలు కుప్పులు తెప్పలుగా ఉన్నవారికే ప్రాధాన్యం ఇచ్చారు. దీనిఎఫెక్ట్ ఎంతగా ఉందో.. పోలింగ్ అయ్యాక చిరుకు తెలిసొచ్చింది. పార్టీ అస్తవ్యస్థ విధానాలతో.. ఆయన కరుడుకట్టిన అభిమానులుగా పేరుపడ్డ ఎంతోమంది.. ప్రజారాజ్యానికి దూరమయ్యారు. అయితే.. అభిమానులను దూరం చేసుకుంటే ఎంతనష్టమో.. ఇప్పుడిప్పుడే చిరుకు తెలుస్తోంది. అందుకే.. స్థానిక సంస్థల్లో అభిమానులకే ప్రాధాన్యం అంటూ ప్రకటించేశారు. ఇదేదో అసెంబ్లీ ఎన్నికల ముందు చేసుంటే.. ఎంతో కొంత ఫలితం అన్నా దక్కేది. ఏం చేస్తాం.. గురుడికి ఇప్పటికన్నా తెలిసొచ్చింది.
11, మే 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి