కేసీఆరా.. మజాకా..
పంజాబ్‌లోని లూథియానాలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొని టిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం సృష్టించారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.. బిజేపీ, కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో జత కట్టి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసిన టిఆర్‌ఎస్.. ఇప్పుడు సడన్‌గా రూటు మార్చడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఎన్నికలకు ముందే.. ఎన్డీఏ వైపు వెళ్లడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నాడని.. 24గంటలు బ్లాగ్‌స్పాట్ అందరికన్నా ముందే తెలిపింది. కేసీఆర్ వ్యవహారశైలి చూస్తే.. ఎన్డీఏ వైపు వెళ్లడం ఖాయమని అప్పట్లోనే తేల్చి చెప్పింది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. మొదటిది.. కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే చెడింది. ఎన్నికల తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణ ప్రాంతంలో టిఆర్‌ఎస్ ప్రాభవం తగ్గిపోవడం ఖాయం. ఇక రెండోది.. మహాకూటమిలోనే ఉండి.. థర్డ్‌ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ప్రయత్నిద్దామంటే.. అది కుదిరేలా కనిపించడం లేదు. ఒకవేళ కుదిరినా .. తెలంగాణ ఏర్పాటుకు వామపక్షాలు ప్రధాన అడ్డంకి కావచ్చు. పైగా.. తెలంగాణ ఏర్పాటు చేసిన క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందే తప్ప కేసీఆర్‌కు రాదు. ఇక బీజేపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఆ పార్టీకీ బలం లేకపోయినా... ఎన్డీఏ కూటమిగా జాతీయ స్థాయిలో శక్తిమంతంగానే ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అద్వానీ ఇప్పటికే ఎన్నోసార్లు ప్రకటించారు. దేశంలో మూడు కొత్తరాష్ట్రాలు ఏర్పాటు చేసిన రికార్డు కూడా ఆ పార్టీకి ఉంది. పైగా.. ఎన్డీఏ కూటమి తరపున తెలంగాణలో పూర్తి ఆధిపత్యాన్ని టీఆర్‌ఎస్ ప్రదర్శించవచ్చు. ఇన్ని రకాలుగా బేరీజు వేసుకున్న తర్వాతే.. కేసీఆర్.. ఎన్డీఏ వైపు అడుగులు వేశారు. ఫలితాలు రాకుండానే.. సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని తప్పక తెలియజేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. మరిన్ని కథనాలను అందించడానికి అదే మాకు ఉత్ప్రేరకం. పోల్‌లో కూడా ఓటేయడం మర్చిపోకండి.. ధన్యవాదాలు.
11, మే 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి