19, మే 2009, మంగళవారం
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా...
ఎన్నికలలో తాను పరాజయంపాలైనప్పటికీ రాజకీయాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సమాజ్‌వాదీ పార్టీ నాయకురాలు, సినీ నటి జయప్రద వెల్లడించారు.
దురదృష్టవశాత్తూ ఓటమి పాలైనప్పటికీ తాను రాజకీయాల గోదా నుంచి తప్పుకోనని స్పష్టం చేశారు. ఎస్పీ సీనియర్ నేత అజమ్‌ఖాన్ పనిగట్టుకుని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనీ, చివరికి ప్రత్యర్థికి లోపాయికారి మద్దతు తెలిపారని, ఎలాగైనా తనను ఓడించాలనే పట్టుదలతో పనిచేశారని జయప్రద ఆవేదన వ్యక్తం చేశారు.
అజమ్‌ఖాన్ అస్లీల సీడీలను పోస్టర్లను పంచడంపై జయప్రద మాట్లాడుతూ, ఇది అతని రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందనీ, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన సైతం వచ్చిందనీ, చివరికి తన కుటుంబ సభ్యుల మద్దతుతో ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డాన్నారు.
ఎన్నికలలో విజయం సాధించి అజామ్‌ఖాన్‌కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అజమ్‌ఖాన్‌పై పార్టీ ఎటువంటి చర్య తీసుకుంటుందని భావిస్తున్నారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, అది పార్టీ అధినేత నిర్ణయిస్తారని జయప్రద సమాధానమిచ్చారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి