ఎల్టీటీఈ అధినేత వేళుపిళ్లై ప్రభాకరన్ మరణవార్తపై సస్పెన్స్ నెలకొంది. పారిపోతున్న పెద్దపులిని కాల్చి చంపామని శ్రీలంక సైన్యం ప్రకటించిన ఒక్కరోజు తర్వాత ఎల్టీటీఈ ఇవన్నీ వదంతులే నంటూ కొట్టిపడేసింది. ప్రభాకరన్ సురక్షితంగా ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు.. ములైత్తీవు పరిసరప్రాంతాల్లో.. వందలాది మంది టైగర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పిన లంకసైన్యం.. ప్రభాకరన్ కొడుకు ఛార్లెస్ ఆంటోని మృతదేహం విజువల్స్‌ను విడుదల చేసింది. ఎయిర్‌టైగర్లకు, ఎల్టీటీఈ ఐటీ విభాగానికి ఆంటోని నాయకత్వం వహిస్తున్నాడు. ఇదే సమయంలో ప్రభాకరన్‌ను చంపేశామని ప్రకటించిన సైన్యం.. దాన్ని నిర్దారించే ఫోటోలను కానీ.. వీడియోను కానీ ఇంతవరకూ బయటపెట్టలేదు. ఇదే ఇప్పుడు ఆయన మరణవార్తపై సందేహాన్ని కలిగిస్తోంది. మరోవైపు.. ప్రభాకరన్ చనిపోలేదంటూ.. తమిళనాడు నేత వైగో ప్రకటించి సంచలనం రేపారు. ఏదేమైనా.. ప్రభాకరన్ ఉన్నాడా లేదా అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది.
19, మే 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి