దేశం మొత్తం మీద మన రాష్ట్రం... అందులోనూ.. మన రాజధాని హైదరాబాద్.. టెర్రరిస్టులకు ఎంత సేఫ్ ప్లేసో మరోసారి అర్థమైపోయింది. ఎక్కడకావాలంటే అక్కడ ప్రత్యక్షమై.. చేయాల్సిన విధ్వంసాన్ని చేసేసి.. చక్కగా వెళ్లిపోగలమని మరోసారి నిరూపించారు టెర్రరిస్టులు. పోలీసులను కన్ఫ్యూజ్ చేసి విచారణ పక్కదారి పట్టించడంకోసం.. చక్కగా మరో కొత్తసంస్థను తెరపైకి తెచ్చారు. మక్కామసీదులో పేలుళ్లు జరిగి రెండేళ్లు పూర్తైనా ఈ కేసు సంగతి అతీగతీ లేకుండానే ఉంది. ఇదే సమయంలో.. మక్కా కాల్పుల్లో పాల్గొన్న పోలీసులందరినీ కాల్చి చంపుతామని తాజా దుండగులు ప్రకటించడంపై ఇప్పుడు అందరిలోనూ ఆందోళన మొదలయ్యింది. కానీ ఏం లాభం.. మన పోలీసు వ్యవస్థ పరిస్థితి మాత్రం రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. నగరంలోకి నలభైమంది కసబ్ల్లాంటి కరుడుగట్టిన టెర్రరిస్టులు వచ్చారు బాబో.. అంటూ నిఘావర్గాలు నెత్తీనోరూ బాదుకున్నా.. పెద్దగా చలనం లేదు. పైగా.. మక్కాబ్లాస్టింగ్ డేన సాధాసీదాగా రెండు చేతి కర్రలు ఇచ్చి కానిస్టేబుళ్లను పికెటింగ్‌కు పెట్టారు. ఎంతధైర్యం మనవాళ్లకు.. ఓవైపు.. ఏకే 47లు, అత్యాధునిక టెక్నాలజీతో బాంబులు.. హ్యాండ్గన్లతో టెర్రరిస్టులు విరుచుకుపడుతుంటే... మన పోలీసులు గాంధీగిరీ చేస్తున్నట్లు కర్రలతో వెళుతున్నారు. ఇలాగే చేస్తే.. హైదరాబాద్ మొత్తాన్ని టెర్రరిస్టులు సర్వ నాశనం చేయడం ఖాయం. మరోవైపు.. రాష్ట్రంలో అంతరించిపోయారని భావిస్తున్న నక్సల్స్ తమ ఉనికిని చాటుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విశాఖమన్యంలో వరసగా రెండు రోజులపాటు విధ్వంసాన్ని సృష్టించారు. ఓ ఎంపీపీ ప్రాణాన్ని బలిగొన్నారు.
రాష్ట్ర ప్రజలపై డెత్‌వారెంట్ జారీ అయ్యింది.
19, మే 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి