ప్రపంచంలో వందకోట్లమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వందకోట్లమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, ఇది గతంలో ఇంతపెద్ద సంఖ్యలో లేదని అమెరికాకు చెందిన ఆహార, ధాన్యాల విభాగం డైరెక్టర్ జైకేస్ డౌఫ్ తెలిపారు. నిరుడు ఆకలితో అలమటించిన వారి సంఖ్యకన్నాకూడా ఇప్పుడున్న వారి సంఖ్య దాదాపు నాలుగు కోట్లు పెరిగి వంద కోట్లకు చేరుకుందని ఆయన వివరించారు. ఇది 2007లో ఏడు కోట్ల 50లక్షలకు చేరుకుందని ఆయన తెలిపారు.ఇదిలావుండగా ఐక్యరాజ్య సమితి వీలైనంతమేర సహాయక చర్యలు చేపట్టి వారికి ఆకలి కొరత తీర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
8, మే 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి