8, మే 2009, శుక్రవారం
హైదరాబాద్‌లో 40 మంది కసబ్‌లు
ముంబైలో మారణహోమం సృష్టించిన కసబ్ ముఠా తరహా ఫిదాయూలు భాగ్యనగరంలో అడుగు పెట్టారు. పదిమందితో కూడిన కసబ్ బృందం ముంబైలో 200 మందిని పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. అదే 40 మంది హైదరాబాద్‌లోకి వస్తే.. ఇంకెంత విధ్వంసం సృష్టించవచ్చో అర్థం చేసుకోవచ్చు. నిఘా వర్గాలు సేకరించిన సమాచారం ప్రకారం.. వీరంతా పాకిస్తాన్‌లో కఠోర శిక్షణను పూర్తి చేసుకుని వచ్చారు. స్లీపర్ సెల్స్‌లా హైదరాబాదీల మధ్య కలిసిపోయారు. వీరందరికీ సౌదీ నుంచి నెల నెలా జీతాలు అందుతున్నాయి. వీరిలో ఎక్కువమంది డీజేఎస్ పూర్వ విద్యార్దులేనని పోలీసులు అనుమానిస్తున్నారు. అధినేతల నుంచి ఆదేశాలు అందిన వెంటనే.. ఆత్మాహుతి దాడులకు తెగబడడానికి సిద్ధంగా ఉన్నవీరి పూర్తి వివరాలను రాబట్టడానికి పోలీస్‌శాఖ తీవ్రంగా శ్రమిస్తోంది. నిఘా సమాచారం తప్ప.. అదనంగా వివరాలేవీ పోలీసులకు ఇంతవరకూ చిక్కలేదు. తీవ్రవాదుల కదలికలు నగరంలో ఉన్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రసాద్‌రావు అంగీకరిస్తుంటే.. పెద్దగా నష్టమేమీ జరగదంటున్నారు.. డీజీపీ ఎ.కె.మహంతి. ఇప్పటికే గోకుల్ ఛాట్, లుంబినీ పార్కుల్లో యధేచ్చగా బాంబులు పేల్చిన ముష్కరమూకలకు.. మళ్లీ దాడులు చేయడం పెద్ద సమస్యేమీ కాదు. మన పోలీసుల అలసత్వం ఆధారంగా చేసుకుని.. సులువుగానే దాడులు చేస్తున్నారు తీవ్రవాదులు. మన పోలీసులకు కావాల్సిందల్లా… స్కూటర్‌పై హెల్మెట్ పెట్టుకునో… కారులో సీటు బెల్టు పెట్టుకునో వెళితే చాలు.. ఆర్డీఎక్స్ పట్టుకెళుతున్నా పట్టించుకోరు మనవాళ్లు. అందుకే.. రక్షణ బాధ్యత తలకెత్తుకోవాల్సింది… ప్రజలే. టీలు తాగేచోట్ల… టిఫిన్లు చేసే చోట.. చివరకు పార్కుల్లో.. రోడ్ల పక్కనా.. ప్రార్థనా మందిరాల్లో నిత్యం అప్రమత్తంగా ఉండండి. అనుమానితులు కనిపిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందించడం మరిచిపోకండి.. బీ కేర్ ఫుల్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి