మాంద్యంతో కుదేలయిన అమెరికా ఆర్థిక వ్యవస్థను తిరిగిగాడిలో పెట్టేందుకు దేశంలో ఉద్యోగాల సంఖ్యను పెంచడంపై ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా దృష్టిపెట్టారు. ఎన్నికల హామీని నెరవేర్చడంలో భాగంగా.. అమెరికా కంపెనీలు బెంగళూరు వంటి నగరాలకు "నో" చెప్పాలని, బఫెలో వంటి అమెరికా నగరాల్లో ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు.బెంగళూరు వంటి విదేశీ నగరాల్లో ఉద్యోగాలు సృష్టిస్తున్న అమెరికా కంపెనీలకు ఏళ్ల తరబడి కొనసాగుతున్న పన్ను రాయితీలను సోమవారం బరాక్ ఒబామా తొలగించారు. ఈ రాయితీలు ఇకపై బఫలో వంటి అమెరికా నగరాల్లో ఉద్యోగాలు సృష్టించే కంపెనీలకు అందిస్తారు.లాభాలపై అమెరికా ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా.. విదేశాల్లో ఉద్యోగాల కల్పనకు కంపెనీలు రాయితీలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అంతర్జాతీయ పన్ను విధానాన్ని ప్రకటిస్తున్న సందర్భంగా బరాక్ ఒబామా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.అమెరికాలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెడుతూ, ఉద్యోగాలు సృష్టిస్తున్న కంపెనీలకు పన్ను మినహాయింపులు అందిస్తామని తెలిపారు. అమెరికా ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం భారత్, చైనా, ఫిలిప్సీన్స్ వంటి దేశాలను ప్రభావితం చేయనుంది. ఈ దేశాల నుంచి అమెరికా కంపెనీలు ఎక్కువగా అవుట్సోర్సింగ్ సేవలు పొందుతున్నాయి.
5, మే 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇది పూర్తిగా సమర్ధనీయం..., భారత ప్రభుత్వం కూడ Indian outsourcing కంపెనీలు చేసే exploitation కి చెక్ పెట్టాలి..!!