5, మే 2009, మంగళవారం
లాభాల బండి
ప్రయాణీకులను దోచుకోవడం ఎలాగో తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాల మీద లాభాలు కళ్లచూస్తోంది. ప్రయాణీకుల అవసరాన్నే క్యాష్ చేసుకుంటూ.. పండగలు.. ప్రత్యేక యాత్రల సమయాల్లో అసలు టికెట్‌కు 50 శాతానికి పైగా వడ్డిస్తున్న ఆర్టీసీ.. ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలను ఆర్జించింది. ఆర్టీసి లాభాల్లో హాట్రిక్ సాధించడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమస్టి విజయమని ఆర్టీసి ఎండి దినేశ్ రెడ్డి చెప్పారు. జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెమిషన్ మిషన్ స్కీం కింద ఆర్టీసికి తొలివిడతలో 162.13 కోట్లు మంజూరయ్యాయన్నారు. వీటితో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు బస్ టెర్మినల్‌లు, ఏడుబస్ డిపోలను ఆధునీకరిస్తామని దినేశ్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, తిరుపతి పట్టణాల్లో లో లెవల్ ఫ్లోర్, సెమిలో లెవల్ ఫ్లోర్ బస్‌లను ఆపరేట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికైనా సాధారణ జనానికి అవసరమయ్యే బస్సులను వేయాలన్న ఆలోచన ఆర్టీసీ యాజమాన్యానికి తడితే బాగుండు..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి