5, మే 2009, మంగళవారం
వాయిదాల వీరుడు
ఏదైనా పనిని వాయిదాల మీద వాయిదాలు వేయడంలో కేసీఆర్‌ను మించిన వారు లేరనే చెప్పాలి. డెడ్‌లైన్ పెట్టడంలోనూ.. ఆయనది ఇదే పద్దతి. ఇదివరకూ తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీతో చాలాకాలం ఇలానే దొంగాపోలీస్ ఆటను కేసీఆర్ ఆడారు. ఇప్పుడు ఢిల్లీ టూర్ నాటకం కొత్తగా మొదలుపెట్టారు. ఇదీ వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో.. జాతీయ స్థాయి నాయకులను ఇప్పటినుంచే మంచిచేసుకోవడానికి.. ఢిల్లీ వెళ్లాలన్నది కేసీఆర్ ప్లాన్. అయితే.. అనుకోని అవాంతరాలు పదే పదే ఆయనకు ఎదురవుతున్నాయి. హస్తినలో.. నాయకులు ఎవరూ లేకపోవడం ఓ కారణమైతే.. ఆయన ప్రణాళిక లోపంకూడా అన్నది పార్టీ లోపల వినిపిస్తున్న టాక్. అవసరమైతే.. అటు కాంగ్రెస్ వైపు గానీ... ఇటు ఎన్డీఏ వైపు గానీ దూకేయడానికి కేసీఆర్ ఇప్పటికే సిద్ధమైపోయారు. తెలంగాణ ఇస్తామంటే.. కుష్టురోగిని కౌగలించుకుంటాం.. బొంతపురుగును ముద్దు పెట్టుకున్నామంటూ ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. కేసీఆర్ తీరు.. టీడీపీ నేతలకు మాత్రం ఇంకా అంతుపట్టడం లేదు. మహాకూటమితో ఉంటారా లేక వెళ్లిపోతారా అన్న విషయంలో స్పష్టత ఇంకా రాలేదు. ఎన్నికల వరకే పొత్తంటూ హరీశ్ లాంటి వారు వ్యాఖ్యానించడం చూస్తుంటే... ఫలితాల అనంతరం కచ్చితంగా మరో కొత్త నాటకం మొదలవడానికి రంగం సిద్ధమైనట్లే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి