భోలక్‌పూర్‌లో కలుషిత నీటిలో 114రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇక్కడ సరఫరా అవుతున్న నీరు త్రాగి అస్వస్థకుగురై ఇప్పటివరకు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరో రెండొందల మంది స్థానికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భోలక్‌పూర్ బస్తీలో జలమండలి నుంచి వస్తున్న మంచినీటిలో 114 రెట్లు ఎక్కవ బాక్టీరియా ఉన్నట్లు ఇండియన్ ప్రీవెంటరీ మెడిసిన్ (ఐపీఎం) రెండు నెలల క్రితమే వెల్లడించింది.ఇదిలావుండగా భోలక్‌పూర్‌లోని ఓ ఇంటిలో ఫిబ్రవరి 3వ తేదిన పైపులైన్‌లోంచి వచ్చిన నీటి శాంపిల్స్‌ను తీసుకొని ఐపీఎం ఫిబ్రవరి నెలలోనే వాటర్‌వర్క్స్‌కు నివేదిక ఇచ్చింది. కానీ అధికారులు దీనిని ఏమాత్రం పట్టించుకోలేదు. 100 మిల్లీలీటర్ల నీటిలో కేవలం 10 ఎంపీఎంలు మాత్రమే కాలిఫాం బాక్టీరియా ఉంటుంది.కాగా ఇక్కడి ప్రజలు వాడుతున్న నీటిలో 1140 ఎంపీఎం కాలిఫాం బాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇలాంటి నీటిని త్రాగటానికి, ప్రత్యేకంగా వంట వండటానికి ఉపయోగించరాదని ఐపీఎం వాటర్ వర్క్స్‌కు తెలిపింది. కానీ వాటర్‌వర్క్స్ అధికారులు దీన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోకపోవడంతో భోలక్‌పూర్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే అధికారులు మాత్రం తోళ్ల పరిశ్రమ ఉండటం మూలానే ఈ సంఘటన జరిగిందని బుకాయిస్తున్నారు.
భోలక్‌పూర్ నీటి కాలుష్యంగురించి జలమండలికి ఇప్పటికే ఎన్నో ఫిర్యాదులు అందాయి. గత ఆరునెలల కాలంలో చూస్తే.. ఈ ప్రాంతం నుంచి వచ్చిన ఫిర్యాదులే ఎక్కువ. అయినా.. మన ఘనత వహించిన అధికారులకు.. సామాన్యుల గోడు పట్టలేదు.
8, మే 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి