హైదరాబాద్‌లోని సచివాలయంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం అనేక అనుమానాలను కలిగిస్తోంది. ప్రధానంగా కీలక సమాచారం ఉండే సర్వర్‌తో సహా కంప్యూటర్లు.. ముఖ్యమైన ఫైళ్లు కాలిపోవడంతో.. ఇవి మరింత ఎక్కువవుతున్నాయి. ఏదో అర్థరాత్రిపూట జరిగింది.. అంతా తేరుకునేలోపే కాలిపోయిందని అనుకోవడానికీ లేదు. జరిగిందంతా పట్టపగలే.. అందరి కళ్లముందే. సచివాలయం డి బ్లాక్‌లో మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మొదలైన మంటలు.. సాయంత్రందాకా చెలరేగుతూనే ఉన్నాయి. వందలాది మంది ఉద్యోగులు.. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ.. మొత్తం రెండు అంతస్తులు కాలి బూడిదయ్యాయి. కంప్యూటర్ సర్వర్ రూంలో మొదట మంటలు చెలరేగినప్పటికీ.. వీటిని ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా.. ఉద్యోగులు ఆపలేకపోయారంటే.. మనవాళ్లు ఎంత జాగ్రత్తగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ అగ్నిప్రమాదం అకస్మాత్తుగా జరిగిందా.. లేక ఎవరైనా కావాలని చేసిన పనా అన్నది ఇంకా తేలలేదు. అందరిలోనూ అనుమానాలు. విపక్షాల నిరసనలు మొదలుపెట్టగానే.. సీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇంతకీ ప్రమాదం జరిగిన భవనాన్ని ఆరేళ్లక్రితమే ఎల్ అండ్ టి సంస్థ నిర్మించింది. ఫైర్ సేఫ్టీకోసం ప్రత్యేక ఏర్పాట్లను ఇందులో చేశారు. అయినా.. ఇంతవరకూ ఒక్కసారికూడా వీటిని పరీక్షించలేదు. చివరకు స్మోక్ అలారంలు కూడా ఈ సమయంలో మోగలేదు. ఆర్థికశాఖ, భారీనీటిపారదల శాఖ మంత్రుల కార్యాలయాలతో పాటు.. ఇంతర మంత్రులవీ ఇందులోనే ఉండడం.. వీరందరికీ సంబంధించిన విలువైన ఫైల్లు అగ్నికి ఆహుతి కావడం గమనార్హం. మరో పదిరోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందన్న తరుణంలో జరిగిన ఈ అగ్నిప్రమాదం చుట్టూనే ఇప్పుడు అనుమానాలన్నీ.. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన రోజే.. వైఎస్ ప్రభుత్వం హడావిడిగా మూడు వందలకు పైగా జీవోలను జారీ చేసింది. వీటికి సంబంధించిన వివరాలు కూడా ఈ బ్లాక్‌లోనే ఉన్నాయి.
8, మే 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి