27, ఏప్రిల్ 2009, సోమవారం
ఈలం చుట్టూ తమిళ రాజకీయం
అధికారంలోకి వస్తే ఏకంగా శ్రీలంక తమిళులకు ప్రత్యేక ఈలం ఏర్పాటు చేస్తామని అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత ప్రకటించడంతో డి.ఎం.కే తొందరపడుతోంది. ఆ పార్టీ అధినేత కరుణానిధి ఏకంగా నిరాహార దీక్షకు దిగారు. శ్రీలంకలో తమిళులపై సైన్యం దాడులను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేసారు. భారత ప్రభుత్వమూ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. శ్రీలంకలో తమిళుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. కరుణతో పటు రాష్ట్ర వ్యాప్తంగా డి.ఎం.కే కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ విషయంలో శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని ప్రధాని మన్మోహన్ కరుణానిధికి చెప్పారు. ఫోన్లో మాట్లాడిన అయన.. నిరశనను ఆపాలని కోరారు. మరో వైపు శ్రీలంక తమిళులకు ప్రత్యేక ఈలం ఏర్పాటు చేస్తామని జయలలిత ప్రకటించడంపై శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే సోదరుడు తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఈలం కోసం మరో చూతు చుసుకోవలె తప్ప.. శ్రీలంకలో అడుగు భూమి కూడా ఇచ్చేది లేదని ప్రకటించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి