అన్నా డిఎంకే అధినేత్రి జయలలిత బాంబు పేల్చారు. ఇప్పటి వరకు ఎల్‌టీటీఈ పట్ల ..
మెతక వైఖరి అవలంబిస్తున్న జయలలిత ఏకంగా ఈలం ఏర్పాటుకు మద్దతు తెలిపారు. ఎల్‌టీటీఈపై ప్రస్తుతం జరుగుతున్న దాడుల్ని ఆమె ఖండించారు. అన్నా డీఎంకే అధికారంలోకి వస్తే ఏకంగా శ్రీలంక తమిళులకు ప్రత్యేక ఈలం ఏర్పాటు చేస్తామన్నారు. తమిళనాడులో ఎన్నికల వేడి రాజకుంది. వైరి పక్షాలు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమౌతున్నాయి. ఎల్‌టీటీఈ చరమదశకు రావడంతో తమిళనాట శ్రీలంక తమిళుల పట్ల సానుభూతి వెల్లువెత్తుతోంది. పరిస్థితిని గమనించిన అన్నా డీఎంకే అధినేత జయలలిత ప్లేటు ఫిరాయించారు. ఇన్నాళ్ళూ ఎల్‌టీటీఈని గట్టిగా వ్యతేరేకించి జయలలిత ఏకంగా ఈలం ఏర్పాటుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు. ఇప్పటికీ సింహళులు శ్రీలంక తమిళుల్ని బానిసలుగా చూస్తున్నారని ఆమె విమర్శించారు. అధికారంలోని డీఎంకే పార్టీ ఇటీవల భారీ ఎత్తున ఎల్‌టీటీఈ అనుకూల చర్యలు తీసుకోవడంతో జయలలిత వెంటనే తన వైఖరిని మార్చుకున్నారు. శనివారం తమిళనాడు బంద్ విజయవంతం కావడంతో ఆమె మరో ముందడుగు వేసి ప్రత్యేక ఈలం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దక్షిణ తమిళనాడులో ఎల్‌టీటీఈ అనుకూల పవనాలు వీస్తుండటం వైకో కూడా తమ కూటమిలో ఉండటంతో జయలలిత తాజా అస్త్రం తమిళనాట రాజకీయల్లో సంచలనం రేపుతోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి