22, ఏప్రిల్ 2009, బుధవారం
నల్లధనమే అక్రమాలకు కారణం
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలకు నల్లధనమే ప్రధాన కారణమని ఎన్నికల సంఘం తాజా మాజీ ప్రధాన కమిషనర్ గోపాలస్వామి పేర్కొన్నారు. రాజకీయాలు నేరమయం కాకుండా ఉండాలంటే నేరస్థులు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన విమెన్ ప్రెస్ కోర్లో గోపాలస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో చాలామంది అభ్యర్ధులు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని అన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 22 కోట్ల మొత్తం పట్టుబడిందంటే ఎంత పెద్ద మొత్తాలను నేతలు ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. అందుకే నేరస్థులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకోవాలని అన్నారు. అదేసమయంలో ఎన్నికల్లో పోటీచేసే వారిపై రాజకీయ దురుద్ధేశ్యంతో కేసులు పెట్టే అవకాశం ఉందని పేర్కొన్న ఆయన తాను మాత్రం రాజకీయాల్లో ప్రవేశించబోనని స్పష్టం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి