శ్రీలంక ప్రభుత్వం ఎల్టీటిఇ అగ్రనేత ప్రభాకరన్ స్థావరాన్ని కనిపెట్టినట్లు సమాచారం. ముల్లైవిత్తు పట్టణానికి సమీపంలోని ఒక చిన్న ప్రాంతంలో ప్రభాకరన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కొంత మందిని బందీలను చేసినట్లు తెలుస్తోంది. తన ప్రాణాల కోసం బేరాసారాలు ఆడడానికి ఆ బందీలను వాడుకోవాలని ఆయన చూస్తున్నట్లు చెబుతున్నారు.శ్రీలంక సైన్యం నిర్ణయాత్మక ప్రదేశానికి చేరుకున్న విషయాన్ని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లక్ష్మణ్ హుల్లగాలే ధృవీకరించారు. ఎల్టీటిఇపై పోరు దాదాపుగా పూర్తయిందని ఆయన చెప్పారు. తమ బలగాలు ప్రభాకరన్ స్థావరానికి చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పారు. ఎల్టీటిఇ కార్యకర్తలు ఇంకా శ్రీలంక సైన్యాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుగుబాటుదార్లు లొంగిపోవాలని శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే సూచించారు. వేలుపిళ్లై ప్రభాకరన్ కు ప్రాణబిక్ష పెట్టబోమని ఆయన చెప్పారు.
ఇద్దరు ఎల్‌టీటీఈ నేతలు లొంగుబాటు
ఎల్‌టీటీఈలోని ఇద్దరు కీలక నేతలు లంక సైన్యానికి లొంగిపోయారు. ఎల్‌టీటీఈ మీడియా ...
కో ఆర్డినేటర్ దయా, అధికార ప్రతినిధి జార్‌జలు లొంగిపోయినట్లు శ్రీలంక సైన్యం అధికారికంగా ప్రకటించింది. మరోవైపు శ్రీలంకలో నెలకొన్న పరిస్థితిపై అగ్రరాజ్యం అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. నో ఫైరింగ్ జోన్‌లోని పౌరులను సురక్షితంగా కాపాడాలని అమెరికా అధికార ప్రతినిధి రాబర్‌టవుడ్ పేర్కొన్నారు. ప్రజలు సురక్షితంగా వెళ్లే వరకు ఇరు వర్గాలు కాల్పుల విరమణ పాటించాలని ఆయన కోరారు.
24, ఏప్రిల్ 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి