టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్‌ని తెలంగాణ ఏసీబీ టార్గెట్ చేసుకోగానే.. ఏపీ సీఐడీ నుంచి ప్రతీకార చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. లోకేశ్ కారు డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కారు డ్రైవర్ కు, గన్ మెన్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను చంద్రబాబు పేరు చెప్పాలంటూ బెదిరించారని నమోదైన కేసులో ఈ నోటీసులు జారీ చేసింది సీఐడీ. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసు తాజానోటీసులతో మళ్లీ దుమారం రేపడం మొదలుపెట్టింది. అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ రెండూ.. ఈ నోటీసుల వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
12, ఆగస్టు 2015, బుధవారం
టిట్ ఫర్ టాట్ - కేటీఆర్ పై ఏపీ సీఐడీ కన్ను
Read more...
లోకేశ్ పై తెలంగాణ ఏసీబీ నజర్
Categories :
acb . cash for vote . chandrababu . lokesh . POLITICS . tdp
ఓటు కు నోటు కేసులో ఏసీబీ వేస్తున్న అడుగులు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇప్పుడు టీడీపీలో కీలక నేత.. చంద్రబాబు వారసుడు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలంటూ.. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఓటు కు నోటు డీల్ జరిగిన రోజు లోకేశ్ ఎవరెవరిని కలిశారన్నదానిపై ఏసీబీ కొండల్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కీలక వివరాలను రాబట్టగలిగితే.. ఆ తర్వాత లోకేశ్ కూ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ తాజా నోటీస్ వ్యవహారంపై అప్పుడు టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.
10, ఆగస్టు 2015, సోమవారం
పవన్.. నువ్వు మాట్లాడాల్సిన సమయం ఇదే!
Categories :
ANDHRA PRADESH . muni koti . news . pawan kalyan . special status
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో ఆత్మహత్యాయత్నం చేసిన మునికామకోటి కన్నుమూశాడు. ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబాన్ని అన్యాయం చేసి వెళ్లిపోయాడు. ఆత్మహత్యలకు ప్రభుత్వాలు కదలవన్న సంగతిని గుర్తించలేకపోయాడు మునికోటి. చచ్చి కాదు.. బ్రతికి సాధించాలన్న నిజాన్నితెలుసుకోలేకపోయాడు. మునికోటి ఆత్మహత్యతో ఇప్పుడు హడావుడి చేస్తున్న నేతలు..వారం పదిరోజులవగానే.. అతన్ని, అతని కుటుంబాన్నిమర్చిపోతారు. వాళ్లను టీవీల తెరలపై చూపించడానికి రోజుకో కొత్త అంశం పుట్టుకొస్తూనే ఉంటుంది. ఇప్పుడు మునికోటి కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామంటూ కొంతమంది ముందుకు వచ్చినా.. అది ఎంతవరకూ ఆకుటుంబానికి అందుతుందన్నది తెలుసుకోవడం కష్టమే. అయితే..ఇలాంటి సమయంలో కాస్త విభిన్నంగా స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మునికోటి మృతికి సానుభూతిని తెలియజేస్తూనే, ఇలాంటి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తనను తాను నియంత్రించుకుంటున్నట్లు ప్రకటించారు. బాగాన ఉంది. కానీ, ఇలాంటప్పుడే పవన్ లాంటి వ్యక్తులు స్పందించాలి. ఆత్మహత్యలకు ఎవరూ పాల్పడవద్దని.. స్పెషల్ స్టేటస్ కోసం మరో మార్గంలో పోరాడదామంటూ ప్రకటించాలి. అవసరమైతే జనంలోకి వెళ్లాలి. తాను ప్రచారం చేసి, ఓట్లు వేయించినందుకు ప్రధాని మోడీని నిలదీయాలి. ఇవేవీ చేయకుండా కేవలం తనను తాను నియంత్రించుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ప్రజలు కూడా దాన్నికోరుకోవడం లేదు. పవన్.. ఇకనైనా నీ పవర్ చూపించు. స్పెషల్ స్టేటస్ పై మోడీని కదిలించు.
పవర్ స్టార్ కు చోటా ఫ్యాన్!
Categories :
abhishesk bachan . cinema . entertainment . pawan kalyan . tollywood
హీరోలందరికీ ఫ్యాన్స్ ఉంటారు. కానీ.. హీరోలనే ఫ్యాన్స్ గా మార్చుకునే హీరోలు అరుదుగా ఉంటారు. యాక్టింగ్ లో పవర్ చూపిస్తూ.. తెలుగు సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మరో సూపర్ ఫ్యాన్ దొరికాడు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కొడుకు.. చోటా బచ్చన్ అభిషేక్ .. తాను పవన్ కు పిచ్చ ఫ్యాన్ అని చెబుతున్నాడు. పవన్ కళ్యాణ్ తీసే ప్రతీ సినిమాను చూస్తానని చెప్పాడు. బాలీవుడ్ హీరో అయ్యి ఉండి.. పవన్ కు ఫ్యాన్ అని చెప్పడానికి తనకు ఎలాంటి మొహమాటం లేదంటున్నాడు. అభిషేక్ మాటలతో పవర్ స్టార్ ఫ్యాన్స్ మరింత ఖుషీ చేసుకుంటున్నారు.
28, జూన్ 2015, ఆదివారం
80 శాతం వినాశనకరమే!
Categories :
health . news . sewage . water pollution
మనం పీల్చే గాలి విషం.. మనం ఉండే నేల విషం.. మనం చూసే ఆకాశం విషం.. మనం తాగే నీరు కూడా విషమే. చివరకు వర్థాలను కాల్చడంవల్ల ఎగసిపడే అగ్నికీలలూ విషాన్నే వెల్లగక్కుతున్నాయి. చెప్పాలంటే.. పంచభూతాలూ విషమయమైపోయాయి.
మన దేశంలో ఉపరితల నీటిలో 80 శాతం కాలుష్య భరితమేనని తేల్చింది తాజా పరిశోధన. భారత పట్టణాభివృద్ధి శాఖ, భారత కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన వివరాల ఆధారాలను బట్టి.. దేశం మొత్తం మీద 75-80 శాతం ఉపరితల నీరు కాలుష్యమయమై పోయింది. మానవవ్యర్థాలు, ఇళ్లనుంచి వస్తున్న మురుగు నీరు, పట్టణ మురుగునీరు అంతా నదులు, చెరువుల్లో చేరడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి వచ్చిందంటోంది. ఎక్కడా ఈ మురుగు నీటిని ట్రీట్‌మెంట్ చేయకుండానే వదిలేయడం వల్ల. .స్వచ్ఛమైన నీరు కాస్తా కాలుష్య భరితమైపోతుందని హెచ్చరించింది. ఈ నీటినే మళ్లీ తాగునీటి అవసరాలకు ఉపయోగించడం వల్ల కలరా, డయేరియా, కామెర్లు లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నాయంటోంది తాజా సర్వే.
మన దేశంలో ఉపరితల నీటిలో 80 శాతం కాలుష్య భరితమేనని తేల్చింది తాజా పరిశోధన. భారత పట్టణాభివృద్ధి శాఖ, భారత కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన వివరాల ఆధారాలను బట్టి.. దేశం మొత్తం మీద 75-80 శాతం ఉపరితల నీరు కాలుష్యమయమై పోయింది. మానవవ్యర్థాలు, ఇళ్లనుంచి వస్తున్న మురుగు నీరు, పట్టణ మురుగునీరు అంతా నదులు, చెరువుల్లో చేరడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి వచ్చిందంటోంది. ఎక్కడా ఈ మురుగు నీటిని ట్రీట్‌మెంట్ చేయకుండానే వదిలేయడం వల్ల. .స్వచ్ఛమైన నీరు కాస్తా కాలుష్య భరితమైపోతుందని హెచ్చరించింది. ఈ నీటినే మళ్లీ తాగునీటి అవసరాలకు ఉపయోగించడం వల్ల కలరా, డయేరియా, కామెర్లు లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నాయంటోంది తాజా సర్వే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)



