youtube లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
youtube లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
1, నవంబర్ 2011, మంగళవారం
శ్రీరామరాజ్యం ట్రయలర్
Categories :
balakrishna . entertainment . sriram rajyam . tollywood . youtube
18, అక్టోబర్ 2011, మంగళవారం
సిగ్గు సిగ్గు.. ఇదేనా మానవత్వం..!
చైనాలో దారుణం చోటు చేసుకుంది. మోడ్రన్ సొసైటీలో మానవత్వం ఎలా మంట గలిసిపోతోందో మరోసారి స్పష్టమయ్యింది. చైనాలోని ఫోషన్ నగరంలో చావుబతుకుల మధ్య ఓ రెండేళ్ల చిన్నారి కొట్టుమిట్టాడుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఆ పసిపాప పక్కనుంచే వెళ్తూ కూడా స్పందించలేదు. ఓ రోడ్డులో చిన్నారి వాంగ్ యూ నడుస్తుండగా.. ఓ కారు ఢీ కొట్టింది. ముందు టైర్లు పాపపైనుంచి వెళ్లిపోయాయి. కారును ఆపినట్లే ఆపి.. మళ్లీ పోనిచ్చాడు. దీంతో వెనుక టైర్ల కింద ఆ అమ్మాయి నలిగిపోయింది. వెంటనే ఆ వీధిలోనుంచి చాలామంది నడుచు కుంటూ.. సైకిళ్లపైనా, మోపెడ్లపైనా వచ్చినా.. చూడనట్లే వెళ్లిపోయారే తప్ప.. వాంగ్ యూను రక్షించడానికి ప్రయత్నించలేదు. ఇంతలో వచ్చిన మరో వ్యాన్ కూడా ఆ అమ్మాయి పై నుంచే వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన ఓ మహిళ.. ఆ పసిపాపను పక్కకు లాగింది. ప్రస్తుతం ఆస్పత్రికి తరిలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉంది. వాంగ్‌యూ బ్రెయిన్‌డెడ్ అయినట్లు చైనా అధికారిక పత్రిక ప్రకటించింది. ఏ క్షణమైనా ఆ అమ్మాయి చనిపోవచ్చని పేర్కొంది. చిన్నారిని ఢీకొట్టిన ఇద్దరు డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానికులపై చైనా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Read more...
దొంగ పెంగ్విన్...!
Categories :
animals . entertainment . penguin . TOP . youtube
ఖైదీనెంబర్ 786
ఈ ఫోటోలో సర్కిల్‌లో కనిపిస్తున్న పెంగ్వినే... దొంగ పెంగ్విన్. ఇది మహా గడుగ్గాయి. పైగా బద్దకిస్ట్. అందుకే.. గూడు కట్టుకోవడానికి మహా తెలువైన ఎత్తుగడను వేసింది. కష్టపడకుండానే గూడు కట్టుకోవాలనుకుంది. దీని వ్యవహారం చూస్తే.. అసలుసిసలు మనిషిలా నే ఉంటుంది. అమాయకంగా ఉంటూనే... పక్క పెంగ్విన్ కష్టపడి ఏరుకొచ్చిన రాళ్లను దొంగిలిస్తుంటుంది. పాపం.. దానికేమో అసలు విషయం అర్థం కాదు. ఎన్ని రాళ్లు తెచ్చినా గూడు నిండకపోయేసరికి అనుమానం వచ్చింది.. రాయి కోసం వెళ్లినట్లే వెళ్లి వెనక్కి తిరిగింది. ఇంతలోనే ఆ దొంగ పెంగ్విన్ రాయిని కొట్టేయడానికి వచ్చింది. అసలు పెంగ్విన్‌కు దొరికిపోయింది. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ దృశ్యాలు బీబీసీ కెమెరాకు చిక్కాయి. మన ముందుకు వచ్చాయి. పూర్తి వీడియోను కింద చూడండి..
Read more...
18, జులై 2011, సోమవారం
ఐదుగురి బలితీసుకున్న జలపాతం.. గగుర్పొడిచే వీడియో

ఇండోర్ సమీపంలో ఉన్న పాతాళపాని జలపాతం దగ్గర హృదయవిదారకర సంఘటన చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబంలో, ఆ జలపాతం విషాధాన్ని నింపింది. చంద్రశేఖర్ రాతి అనే 55 ఏళ్ల పెద్ద మనిషి తన ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి పాతాళపాని జలపాతం దగ్గరకు పిక్నిక్ వెళ్లాడు. వాటర్ లెవల్ తక్కువగా ఉండడంతో జలపాతం అంచుకు వెళ్లి ఫోటోలు దిగుతున్నారు. వారితో పాటు ఆ సమయంలో మరో పదిహేను, ఇరవై మంది వరకూ అక్కడ ఉన్నారు. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. వరదను గమనించి ఒడ్డున ఉన్నవాళ్లు ఒక్కసారిగా కేకలు పెట్టారు. ఆ హెచ్చరికలు విని నీటిలో ఉన్నవారంతా పరుగులు తీస్తూ ఒడ్డుకువచ్చారు. అదే సమయంలో వరద వారిని చుట్టుముట్టింది. కొంతమంది పడుతూ లేస్తూ ఒడ్డున పడ్డా, చంద్రశేఖర్ ఫ్యామిలీ మాత్రం మధ్యలోనే చిక్కుకుపోయింది. నీటిప్రవాహం తగ్గుతుందనుకుని ఆగిపోయిన వారు, అదెంత పెద్ద పొరపాటో కాసేపట్లోనే తెలిసి వచ్చింది. చంద్రశేఖర్ కుటుంబంతో పాటు మరో యువకుడు కూడా నీటిలో చిక్కుకుపోయాడు.
ఒకరినొకరు పట్టుకొని ఉన్నా.. నీటి ఉధృతిని తట్టుకోలేకపోయారు. ఒకరు జారి పడిపోవడంతో.. అందరూ కిందపడ్డారు. అంతే, మాయదారి వరద వారిని జలపాతంలోకి తోసేసేంది. ఈ సంఘటనలన్నీ కేవలం నిమిషం వ్యవధిలోనే జరిగిపోయాయి. వారిని కాపాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అయితే.. నీటిలో కొట్టుకుపోయిన తర్వాత స్థానికులు రంగంలోకి దిగి ఇద్దరు యువకులను మాత్రం ప్రాణాలతో కాపాడగలిగారు. ఓ అమ్మాయి మృతదేహాన్ని వెలికితీశారు. ఒడ్డున ఉన్న ఓ టూరిస్ట్ తీసిన వీడియోతో ఈ ఘోర ప్రమాదం ప్రపంచానికి తెలిసింది. మధ్యప్రదేశ్ లో వరసగా వరదల్లో చిక్కుకుపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారి సంఖ్య ఈ నెలలో చాలా ఎక్కువగా ఉంది. అసలే వర్షాకాలం, నదుల సమీపంలోకి వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి గుర్తుచేస్తోంది. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది ప్రాణాలపైకి తెస్తుంది. 30, మార్చి 2011, బుధవారం
సాధారణ ప్రశ్నలు.. అసాధారణ సమాధానాలు
Categories :
ఇది పరీక్షల కాలం. పరీక్షలంటే పిల్లలకు ఎంత చికాకో అందరికీ తెలిసిందే. సమాధానం తెలియనప్పుడు.. ఆ ప్రశ్నలే వారికి దెయ్యాల్లా.. భూతాల్లా కనిపిస్తాయి. అలాంటి కొన్ని ప్రశ్నలకు, మహా తెలివిగా పిల్లలిచ్చిన సమాధానాలను చూడండి.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

