19, డిసెంబర్ 2011, సోమవారం
శశిని వదిలించుకున్న జయ
స్నేహానికి మారుపేరుగా, అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా ఇంతకాలం కనిపించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆమె సహచరి శశికళ విడిపోయారు. విడిపోయారేనకన్నా, శశికళను జయలలితే వదిలించుకున్నారనడం వాస్తవం. శశికళ జోక్యం రోజురోజుకూ ఎక్కువవుతుండడం, ప్రభుత్వంలో పెత్తనం చెలాయిస్తుండడంతో, జయలలిత అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. శశికళను, ఆమె భర్తను, ఆమెకు సంబంధించిన మరో పదిమందిని పార్టీనుంచి బహిష్కరించారు. ఇకపై పార్టీనేతలు వారితో ఏ స్థాయిలోనూ, ఎలాంటి సంబంధాలు కొనసాగించకూడదని కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని కేసులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చిన శశికళను అంటిపెట్టుకునే ఇంతకాలం ఉన్న జయలలిత ఆకస్మికంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం డీఎంకే వర్గాలకు, రాజకీయ పండితులకు అంతుబట్టడం లేదు. అయితే, పార్టీలో మరో పవర్ సెంటర్ గా శశికళ ఎదగడానికి ప్రయత్నించడమే జయ ఆగ్రహానికి కారణమయ్యిందన్న అనుమానాలున్నాయి. వారం రోజుల క్రితమే శశికళకు దూరంగా ఉండాలని కొంతమంది మంత్రులకు జయలలిత సూచించినట్లు సమాచారం. శశికళ మాత్రం ఈ విషయంలో ఇంతవరకూ స్పందించలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి