అవును.. హైదరాబాద్ టెన్నిస్ బ్యూటీ, వరల్డ్ డబుల్స్ నెంబర్ 5 సానియా మీర్జా తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాల కోటి రూపాయలు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడానికి అంగీకరించిన సానియా దానికోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి కోటి రూపాయలను వసూలు చేసుకుంది. అయితే, నేరుగా ఇస్తే విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో గానీ, యూఎస్ ఓపెన్ ఆడడానికి వెళ్తున్న సానియాకు ఆర్థిక సాయం కింద కోటి రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించింది కేసీఆర్ సర్కార్. ఇప్పటికే మ్యాచ్ ల ద్వారా, యాడ్స్ ద్వారా, ట్రైనింగ్ అకాడమీ ద్వారా జోరుగా సంపాదిస్తున్న సానియాకు యూఎస్ ఆడడానికి వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేదనుకోలేం. కాబట్టి, ఇదంతా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం కోసమే తీసుకున్నట్లు భావించాల్సి ఉంటుంది.
sania లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sania లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
23, జులై 2014, బుధవారం
13, ఏప్రిల్ 2010, మంగళవారం
హమ్మయ్య పెళ్లయ్యింది
మన దేశంలో మాత్రమే కాదు.. పొరుగునున్న పాకిస్తాన్‌తో పాటు.. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ పెళ్లి ఎట్టకేలకు జరిగింది. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతర్లకే కాదు.. ఇప్పుడు మీడియాకు.. టీవీలకు అతుక్కుని చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎంతో రిలీఫ్. అవుతుందా... లేదా అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ డైలీ సీరియల్‌గా సాగిన ఆ స్టోరీకి.. ఇప్పుడు శుభం కార్డు పడింది..
ఇక పెళ్లి కథలోకి వెళితే..
వధువు.. సానియా మీర్జా..
వయస్సు.. 23 సంవత్సరాలు..
బ్యాక్‌గ్రౌండ్.. భారత నెంబర్‌వన్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్..
సింగిల్స్‌లో 1 WTA టైటిల్‌ను, డబుల్స్‌లో 8 WTA టైటిల్స్‌ను, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఏకైక ఇండియన్ ఉమెన్ ప్లేయర్..
2003లో కెరీర్ మొదలుపెట్టి.. అతితక్కువ సమయంలోనే భారత అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్న టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. ఆమె ప్రతిభకు 2004లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ అవార్డు వరించాయి. ఇలా ఎన్నో రికార్డులు సృష్టించిన సానియా.. అటు ఆటతోనూ.. ఇటు అందంతోనూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొంది.
ఇండియా మొత్తంమీద చూస్తే... బాలీవుడ్ తారలకు సరిసమానంగా క్రేజ్ ఉన్న ఏకైక స్పోర్ట్స్ ఉమెన్.. సానియామీర్జా. చేసుకుంటే సానియానే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నవారు ఎంతోమంది. ఏడాదిన్నర క్రితం నిఖా జరిగినప్పుడే.. కొంతమంది హైదరాబాద్ వచ్చి మరీ నానా హడావిడి చేశారు. అయితే... చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ షోహ్రబ్‌తో నిశ్చితార్థాన్ని పెళ్లిదాకా రానివ్వకుండా రద్దు చేయించిన సానియా, తన హృదయాన్ని మాత్రం పాక్ క్రికెటర్‌కు ఇచ్చేసింది.
ఇక వరుడు మరెవెరో కాదు.. పాకిస్తాన్ క్రికెటర్ ప్లేయర్ షోయబ్ మాలిక్. వయస్సు.. 28 ఏళ్లు. ఈ పాక్ ప్లేయర్‌కు కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంది. చూడడానికి స్మార్ట్‌గా కనిపించే షోయబ్.. క్రికెట్ కూడా అంతే స్మార్ట్‌గా ఆడతాడు. అతి తక్కువ కాలంలో.. పాక్ టీంలో కీలక ప్లేయర్‌గా అవతరించాడు. 1999లో టీం లోకి వచ్చిన షోయబ్.. 2007 నాటికల్లా కెప్టెన్సీ ఛాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. అంటే.. పాతికేళ్లకే పాక్ క్రికెట్ పగ్గాలను చేపట్టాడు. ఓ మ్యాచ్‌లో షోయబ్ పెర్ఫామెన్స్ చూసిన సానియా మీర్జా.. అతని ఫ్యాన్ అయిపోయింది. ఇద్దరిమధ్యా మొదలైన దోస్తానా కాస్తా.. లవ్‌గేమ్‌గా మారింది. చివరకు షాదీగా సుఖాంతమయ్యింది.
9, ఏప్రిల్ 2010, శుక్రవారం
సానియా పెళ్లి సాయంత్రమే..

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. పెళ్లి అందరూ అనుకుంటున్నట్లు ఏప్రిల్ 15న కాదు. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు జరుగుతోంది. షోయబ్ చుట్టూ వివాదాలు కమ్ముకోవడంతోనే అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయేషాకు విడాకులు ఇచ్చినా.. పాకిస్తాన్ మీడియా మాత్రం షోయబ్ రాసలీలలను ఒక్కొక్కటిగా బయటపెడుతూనే ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే.. ఏం జరుగుతుందో అన్న అనుమానంతో... వెంటనే పెళ్లి చేసేయాలని నిర్ణయించారు. సాయంత్రం 7 గంటలకు సానియా ఇంట్లోనే నిఖా జరుగుతుంది. మగరీబ్ నమాజ్ అనంతరం నిఖానామాపై షోయబ్,సానియాలు సంతకాలు చేస్తారు. అయితే.. ఏప్రిల్ 15 కోసం సిద్ధం చేస్తున్న తాజ్‌కృష్ణ హోటల్‌లోని బాల్‌రూంలో పెళ్లికి బదులు రిసెప్షన్ నిర్వహిస్తారు. మరోవైపు.. ఆయేషాతో విడాకుల కోసం... 15 వేలు చెల్లించినట్లు తలాక్ పత్రంలో పేర్కొన్నా.. దాదాపు 15 కోట్ల రూపాయలను అందించినట్లు తెలుస్తోంది.
28, జనవరి 2010, గురువారం
సోహ్రబ్‌కు సానియా గుడ్‌బై..

పెళ్లి కాకుండానే సానియా జంట విడిపోయింది. ఎంతో అంగరంగ వైభవంగా తాజ్ హోటల్లో రిసెప్షన్ జరిపించుకున్న సానియా మీర్జా.. షోహ్రబ్‌ల జోడీ పెళ్లిదాకా కలిసికట్టుగా సాగలేదు. నిశ్చితార్థం రద్దు చేసుకుంటున్నట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి. ఇకపై పూర్తిగాఆటపైనే సానియా దృష్టి పెడుతుందని ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు. సానియా, సోహ్రబ్‌ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. నిశ్చితార్థం జరగడానికి దాదాపు ఐదేళ్ల ముందు నుంచే... సానియా, సోహ్రబ్‌లు మంచి ఫ్రెండ్స్. ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత మాత్రం వీరిద్దరికి అభిప్రాయబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. ఈ పెళ్లి సానియాకు ముందు నుంచే ఇష్టం లేదనీ తెలుస్తోంది. దీనికి తోడు ఎంగేజ్‌మెంట్ తర్వాత.. సానియా కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. అడపాదడపా ఆమె సాధించే విజయాలు కూడా ఈ ఆరునెలల కాలంలో ఒక్కటీ దక్కలేదు. ఈ నేపధ్యంలో.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమమని భావించినట్లు తెలుస్తోంది. దీన్ని ధృవీకరిస్తూ.. మీడియా ఛానళ్లకు ఇమ్రాన్ మీర్జా ఎస్.ఎం.ఎస్‌లు కూడా పంపించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
