సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ హీరోయిన అంజలి చేసిన ఆరోపణలకు అదే స్థాయిలో ఆరోపణలు చేసింది ఆమె పిన తల్లి (దత్తత తల్లి) భారతీ దేవి. అంజలిని హీరోయిన్ చేయడానికి తానెన్నో కష్టాలు పడ్డానంటూ మీడియా ముందు బావురుమంది. అంజలితో కావాలనే ఎవరో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని, తనకు దూరం చేయడానికే కుట్రపన్నారంటూ ఆరోపించింది. అంజలి హీరోయిన్ ఇవాళ అందరికీ తెలిసిందంటే, దానికి కారణం తమిళ డైరెక్టర్ కళంజియమేనంది భారతీదేవి. అప్పట్లో ఆయన అవకాశమే ఇవ్వకపోతే, అంజలి హీరోయిన్ అయ్యేదే కాదంది. ఎంతోకష్టపడి ఆమెను ఉన్నతస్థానానికి తీసుకువస్తే, ఇవాళ తనపైనే ఆరోపణలు చేయడం చాలా బాధాకరమంది ఆవిడ. ఇక అంజలి కోట్లకు కోట్లు సంపాదించడం లేదని, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వరకూ అంజలికి 25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని, అంతకు ముందు పది, పదిహేను లక్షలే రెమ్యునరేషన్ అని వివరించింది. అటు డైరెక్టర్ కళంజియం కూడా చెన్నై పోలీస్ కమిషనర్ ను కలుసుకున్నారు. తనపై అంజలి చేసిన ఆరోపణలను వివరించారు.
ఇక సడన్ గా మాయమైన అంజలి, ఇవాళ సాయంత్రం బెంగళూరుకు చేరుకోనున్నట్లు సమాచారం. బోల్ బచ్చన్ తెలుగు రీమేక్ లో ఆమె పాల్గొనాల్సి ఉంది.
పన్నెండేళ్ల వయస్సుప్పుడే తన అక్కకూతురైన అంజలిని, భారతీదేవి దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. అంజలికి సినిమా నటిగా మార్చడానికి భారతీదేవి తీవ్రంగా ప్రయత్నించింది. డైరెక్టర్ కలంజియం కారణంగా ఆమె హీరోయిన్ అయ్యింది. చిన్నచితకా సినిమాల్లో చేస్తున్న ఆమెకు, షాపింగ్ మాల్, జర్నీలు బ్రేక్ ఇచ్చాయి. సీతమ్మవాకిట్లోతో, తెలుగులోనూ అవకాశాలు అందివచ్చాయి. ప్రతీరోజు షూటింగ్ కు వెళ్లమంటూ భారతీ దేవి తనను వేధిస్తున్నట్లు అంజలి చెబుతోంది. పైగా, తాను సంపాదిస్తున్న డబ్బుతో ఆమె ఎంజాయ్ చేస్తోందని ఆరోపిస్తోంది. ఇటీవలే మేజర్ అయిన అంజలి, తన పనులకు అడ్డుగా ఉన్న పిన్ని పక్కకు తప్పించడానికే, మీడియా ముందు గగ్గోలు పెట్టిందని తెలుస్తోంది.
పిన్ని బాధలనుంచి తప్పించుకుందనుకున్నా, ఏ అండా లేని వాళ్ల జీవితాలతో ఆడుకునే ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలను సీతమ్మ ఎలా నెగ్గుకు రాగలుతుందో చూడాలి.
family war లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, ఏప్రిల్ 2013, మంగళవారం
సిరిమల్లె చెట్టుకింద సీతమ్మ కష్టాలు
Categories :
family war . heroine anjali . news . tollywood . TOP
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ హీరోయిన అంజలి చేసిన ఆరోపణలకు అదే స్థాయిలో ఆరోపణలు చేసింది ఆమె పిన తల్లి (దత్తత తల్లి) భారతీ దేవి. అంజలిని హీరోయిన్ చేయడానికి తానెన్నో కష్టాలు పడ్డానంటూ మీడియా ముందు బావురుమంది. అంజలితో కావాలనే ఎవరో ఇలా ఆరోపణలు చేయిస్తున్నారని, తనకు దూరం చేయడానికే కుట్రపన్నారంటూ ఆరోపించింది. అంజలి హీరోయిన్ ఇవాళ అందరికీ తెలిసిందంటే, దానికి కారణం తమిళ డైరెక్టర్ కళంజియమేనంది భారతీదేవి. అప్పట్లో ఆయన అవకాశమే ఇవ్వకపోతే, అంజలి హీరోయిన్ అయ్యేదే కాదంది. ఎంతోకష్టపడి ఆమెను ఉన్నతస్థానానికి తీసుకువస్తే, ఇవాళ తనపైనే ఆరోపణలు చేయడం చాలా బాధాకరమంది ఆవిడ. ఇక అంజలి కోట్లకు కోట్లు సంపాదించడం లేదని, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వరకూ అంజలికి 25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చారని, అంతకు ముందు పది, పదిహేను లక్షలే రెమ్యునరేషన్ అని వివరించింది. అటు డైరెక్టర్ కళంజియం కూడా చెన్నై పోలీస్ కమిషనర్ ను కలుసుకున్నారు. తనపై అంజలి చేసిన ఆరోపణలను వివరించారు.
ఇక సడన్ గా మాయమైన అంజలి, ఇవాళ సాయంత్రం బెంగళూరుకు చేరుకోనున్నట్లు సమాచారం. బోల్ బచ్చన్ తెలుగు రీమేక్ లో ఆమె పాల్గొనాల్సి ఉంది.
పన్నెండేళ్ల వయస్సుప్పుడే తన అక్కకూతురైన అంజలిని, భారతీదేవి దత్తత తీసుకున్నట్లు తెలుస్తోంది. అంజలికి సినిమా నటిగా మార్చడానికి భారతీదేవి తీవ్రంగా ప్రయత్నించింది. డైరెక్టర్ కలంజియం కారణంగా ఆమె హీరోయిన్ అయ్యింది. చిన్నచితకా సినిమాల్లో చేస్తున్న ఆమెకు, షాపింగ్ మాల్, జర్నీలు బ్రేక్ ఇచ్చాయి. సీతమ్మవాకిట్లోతో, తెలుగులోనూ అవకాశాలు అందివచ్చాయి. ప్రతీరోజు షూటింగ్ కు వెళ్లమంటూ భారతీ దేవి తనను వేధిస్తున్నట్లు అంజలి చెబుతోంది. పైగా, తాను సంపాదిస్తున్న డబ్బుతో ఆమె ఎంజాయ్ చేస్తోందని ఆరోపిస్తోంది. ఇటీవలే మేజర్ అయిన అంజలి, తన పనులకు అడ్డుగా ఉన్న పిన్ని పక్కకు తప్పించడానికే, మీడియా ముందు గగ్గోలు పెట్టిందని తెలుస్తోంది.
పిన్ని బాధలనుంచి తప్పించుకుందనుకున్నా, ఏ అండా లేని వాళ్ల జీవితాలతో ఆడుకునే ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టాలను సీతమ్మ ఎలా నెగ్గుకు రాగలుతుందో చూడాలి. 8, ఏప్రిల్ 2013, సోమవారం
ఎన్టీ..వార్ : బాలకృష్ణపై హరికృష్ణ ఆగ్రహం
Categories :
balakrishna . family war . flex dispute . harikrishna . ntr . POLITICS . tdp . TOP
ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ లు కనిపించడంపై రేగుతున్న వివాదానికి మరింత ఆజ్యం పోశారు సీనియర్ ఎన్టీఆర్ తనయుడు, జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ. ఎవరో అభిమాని పెట్టిన దానికి తన కొడుకును బాధ్యుడిని చేయడం ఎంత వరకూ సబబని ప్రశ్నించారాయన. పైగా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బాలయ్య హెచ్చరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అలా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. ఎన్టీఆర్ ను అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారన్నారాయన. ఎవరో చేసిన తప్పులకు తన కుటుంబం ఇప్పటికే చాలా నష్టపోయిందని, తన కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేయవద్దంటూ కోరారాయన. సీనియర్ ఎన్టీఆర్ దేవుడు లాంటివాడని, ఆయన ప్రజలందరి వాడని, ఎవరైనా పార్టీలకు అతీతంగా ఆయన ఫోటోను పెట్టుకోవచ్చన్నారు హరికృష్ణ. దీనిపై ప్రజల మధ్యకు వస్తే బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. దీంతో, ఇంతకాలం ఎన్టీఆర్, బాలయ్యల మధ్యే ఉందనుకున్న విబేధాలు కాస్తా, హరికృష్ణ, బాలయ్య మధ్యకు షిఫ్ట్ అయ్యాయి. ఈ రెండుకుటుంబాల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలను వీధికెక్కించాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)